మరో మాజీ మంత్రికి బాబు వెన్నుపోటు పల్నాడులో రచ్చ రచ్చ

ఇదే సమయం.. ఇదే సమయం..చంద్రబాబు చివరి సమయం. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన తీసుకునే నిర్ణయాలు.. పార్టీని గాడిలో పెట్టడం దేవుడెరుగు.. పార్టీ విచ్ఛిన్నం అవుతోంది. సీనియర్లను కాదని ఎవరెవరికొ టిక్కెట్లు ఇస్తా అంటే మేమెలా ఒప్పుకుంటాం అంటూ.. సీనియర్ నాయకులు,, అదేవిధంగా సీనియర్ల వారసులు అధిష్టానం నిర్ణయాలపై సీరియస్ అవుతున్నారు. తాజాగా సత్తెనపల్లి టిడిపి ఇంచార్జ్ నియామకంపై అదే పార్టీ నేత కోడెల శివరాం.. పోరాటం చేస్తున్నారు. ఇక ఆయనకు కొందరు సీనియర్ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇదే నేపధ్యంలోనే..
చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు వణికిపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. చిలకలూరిపేట వ్యవహారం తెరపైకి వచ్చింది. కొత్తవారితో పోటీ ఉన్న కొంతమంది సీనియర్లు టెన్షన్ పడుతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రత్తిపాటి పుల్లారావు పేరు తాజాగా తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాటికి కూడా టికెట్ దక్కే అవకాశాలు లేవని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన భాష్యం ప్రవీణ్ … ఈమేరకు విందులు వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో భాష్యం ఫౌండేషన్ పేరుమీద పేట ప్రాంతంలో భారీగా సేవా కార్యక్రమాలు చేశ్తున్నారు. వీటీన్నింటితో చంద్రబాబు–లోకేష్ ల దృష్టి ప్రవీణ్ పై పడిందని తెలుస్తుంది.ఇటీవల మహానాడులో చంద్రబాబు వయసు 73 కావడంతో 73 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ జెండాలతో ప్రవీణ్ అనుచరులు తిరుగుతున్న సమయంలో అలర్ట్ అయిన పుల్లారావు… అసలు భాష్యం ప్రవీణ్ ఎవరు..? అతడికి చిలకలూరిపేటకు సంబంధం ఏమిటి..? ఆయనకు చిలకలూరిపేటలో ఓటుహక్కు అయినా ఉందా..? గెలిచినా ఓడినా ఆయన మళ్లీ పేటలో ప్రజలకు కనిపిస్తారా..? అంటూ వరుస ప్రశ్నలతో ఫైరయ్యారు. ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలది హడావుడేనంటూ వ్యాఖ్యానించారు. అక్కడో 10వేలు.. ఇక్కడో 10 వేలు ఇచ్చి టికెట్ కావాలంటే ఇచ్చేస్తారా?. ఇప్పుడేదో కోటి ఖర్చు పెట్టి హడావుడి చేస్తారు.. తర్వాత చేతులెత్తేస్తారు అంటూ ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కోడెల శివరాం కి జరిగిన అన్యాయంపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. కోడెల కుటుంబానికి న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ కూడా చేశారు. మరి ఈ రచ్చను బాబు ఎలా సైలంట్ చేస్తారనేది వేచి చూడాలి!