యనమల ఫ్యామిలీకి బాబు షాక్..! టీడీపీకి భారీ ఓటమి..

ఆయన మాజీ స్పీకర్ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత. పేరు యనమల రామక్రిష్ణుడు తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన నాయకుడు. టీడీపీ ఎపుడు అధికారంలోకి వచ్చినా బాబు పక్కన క్యాబినెట్ బెర్త్ ఆయనకు ఖాయం. ఇక 2025 దాకా ఎమ్మెల్సీ పదవి చేతిలో ఉంచుకున్న యనమల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలని చూస్తున్నారు.తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా చూసుకోవాలన్న యనమల వారి ఆరాటానికి చంద్రబాబు మొహమాటం కూడా సహకారం అందిస్తూండడంతో తుని అసెంబ్లీ సీటు కుమార్తెకు కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. ఇప్పటికి ఇరవైఏళ్ళుగా తునిలో యనమల ఫ్యామిలీకి గెలుపు పిలుపు వినబడడంలేదు. 2009 ఎన్నికల్లో యమమల స్వయంగా టీడీపీ అభ్యర్ధిగా ఓడారు.

ఇక 2014 2019 ఎన్నికల్లో తన తమ్ముడు యనమల క్రిష్ణుడిని పోటీకి పెట్టినా కూడా ఆయనా వరసగా ఓడారు. మరి 2024 సంగతేంటి అంటే ఈసారి కూతురికి టికెట్ ఇవ్వాలని యనమల బాబు వద్ద గట్టిగానే పోరు పెడుతూ వస్తున్నారు అని ప్రచారంలో ఉన్న మాట. అయితే తునిలో కాంగ్రెస్ రెండు సార్లు వైసీపీ రెండు సార్లు గెలిచింది. ఇపుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు.పైగా అయన మంత్రిగా ఉన్నారు. దాడిశెట్టి రాజా ధాటిని ఎదుర్కోవడం కష్టమే అని తమ్ముళ్ళు భావిస్తున్న వేళ సమర్ధుడికి యనమల ఫ్యామిలీకి చెందని వారికి టికెట్ ఇస్తే గెలుచుకుని వస్తారని కూడా అధినాయకత్వానికి సూచిస్తున్నారు. కానీ యనమల తన సీనియారిటీని తమ రాజకీయ అనుభవాన్ని బాగా ఉపయోగించారని అంటున్నారు. దాంతో చక్రం గట్టిగా తిప్పేసి కుమార్తెకు టికెట్ ఇప్పించుకుంటున్నారు అని టాక్ వేడిగా వాడిగా నడుస్తోంది.