బిగ్ బ్రేకింగ్స్ రాజధాని కేసులో సుప్రీం సంచలన తీర్పు

ఏపీ రాజధాని కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నేడు మరొకసారి సుప్రీంకోర్టులో విచ్చారణ జరిగింది. ఈ వ్యవహారంలో సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించి౦ది. కేసు విచారణ జులై 11న చేపడతామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు మరోసారి కోరగా.. స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంత మంది రైతులు చనిపోయారని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. మరణించిన వారి తరఫున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు అనుమతివ్వాలని న్యాయవాదులు కోరగా అందుకు అనుమతించిన ధర్మాసనం .. వారికి నోటీసులు పంపాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులను ఆదేశించింది. ఏపీ రాజధాని అంశం ఎప్పుడు ఓ కొలిక్కి వస్తుందా అని రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠ భరితంగా ఎదురుస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో మరింత నిరాశ కలిగించిందని చెప్పాలి. ఈ తీర్పు ఏపీ ప్రభుత్వానికి మరో సవాల్ అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టును పదేపదే కోరారు. అయినప్పటికీ న్యాయవాదులు మాత్రం తాము తీసుకున్న నిర్ణయం ప్రకారమే కేసును విచారిస్తామని, ఇప్పటికిప్పుడు తీర్పు ఇవ్వాలంటే అయ్యే పని కాదని ధర్మాసనం వెల్లడించింది. జస్టిస్ కె ఎం జోసెఫ్ జూన్ 16వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపధ్యంలో కేసు విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించచింది. తను రిటైర్ అవుతున్నందున అమరావతిపై సుదీర్ఘ వాదనలు విని జడ్జిమెంట్ రాసేందుకు సమయం లేదని న్యాయమూర్తి కె. ఎం. జోసెఫ్ వెల్లడించారు. జులై 11న వేరే ధర్మాసనం ముందు అమరావతి కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.