బాబు కొంప ముంచిన గంటా ఎమ్మెల్సీ ఎన్నికల ఉత్కంఠ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో మూడు చోట్ల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇక ఈ నేపధ్యంలోనే.. ఇకపై ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా టిడిపి కి దక్కకూడదని సిఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మరో మూడు రోజుల్లో జరిగే ఎమ్మెల్యేకోటా ఎన్నికల్ని గెలిచేందుకు వైఎస్ జగన్ సర్వశక్తులొడ్డుతున్నారు. అసెంబ్లీతో పాటు బయటా ఎమ్మెల్యేల కట్టడికి ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఎమ్మెల్యే సంఖ్యా భలం తో 6 ఎమ్మెల్సీ స్థానాలలో వైసీపీ సునాయాసంగా గెలుపొందటం ఖాయం. అయితే.. అయితే ఆరు సీట్లకు సరిపడా ఎమ్మెల్యేల తర్వాత తమ క్యాంపులో మిగిలిన ఇతర ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నుంచి తమకు మద్దతిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలు, ఓ జనసేన ఎమ్మెల్యే ఓట్లు తమకు పడతాయని ఊహించి వైసీపీ ఏడో అభ్యర్ధిని కూడా నిలబెట్టింది. వైసీపీకి తాము నిలబెట్టిన ఏడో అభ్యర్ధిని కచ్చితంగా గెలిపించుకోవాల్సిన స్ధితి. ఇక టిడిపిలో ఉన్న 23మందిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వెంట ఉన్నారు. ఇక వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు రెబల్ గా మారారు. ఈ ఇద్దరు టిడిపి కి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. దీంతో టిడిపికి 19 మంది సంఖ్యా బలం ఉంది. కానీ ఎమ్మెల్సీ స్థానం గెలుపొందాలంటే.. 22 మంది సంఖ్యా బలం అవసరం.

టీడీపీ కి ఎలా ఓట్లు తగ్గించాలన్న దానిపై ఇప్పుడు వైసీపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం స్పీకర్ వద్ద గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ పెండింగ్‌లో ఉంది . చాలా కాలంగా ఆమోదించలేదు. ఇప్పుడు ఆమోదించినట్లుగా నోటిఫికేషన్ ఇస్తే.. ఆయన ఓటు హక్కు కోల్పోతారు. అదే జరిగితే టీడీపీకి ఓ ఓటు తగ్గిపోతుంది. వైసీపీ సభ్యులకు మరింత అడ్వాంటేజ్ వస్తుంది. అయితే ఇది కాస్త రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. గంటా రాజీనామా ఆమోదిస్తే ఉపఎన్నిక వస్తుంది. దాన్ని ఎదుర్కోగలం అనుకుంటే చేస్తారు.. లేకపోతే లేదు. ఒకవేళ గంటా శ్రీనివాస్ రాజీనామాను స్పీకర్ ఆమోదీస్తే.. చంద్రబాబుకు ఇబ్బంది తప్పదని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందో చూడాలి.