గట్టి దెబ్బకొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు బాబుకు భారీ ఓటమి

చంద్రబాబు ప్రస్తుతం ఓ అయోమయంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని చంద్రబాబు పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో ఒక స్థానానికి అభ్యర్థిని పోటీకి పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారట. ఈనెల 13తో నామినేషన్ల గడువు ముగియనుంది.ఈ స్థానానికి పంచుమర్తి అనూరాధ పేరును పరిశీలిస్తున్నట్లు తెదేపా వర్గాల సమాచారం. ఒక్కో స్థానంలో అభ్యర్థి గెలవాలంటే 22 నుంచి 23 ఓట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం తెదేపా తరపున 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వారిలో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి వైకాపాకు మద్దతు ప్రకటించారు.

చివరికి 23 మంది కాస్తా 19 మంది మాత్రమే టిడిపి లో మిగిలారు. ఈ 19 మందితో ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసినా టిడిపి ఎట్టి పరిస్థితులోనూ గెలిచే అవకాశం లేదు. అయినా అభ్యర్థిని పోటీకి దింపి ఎమ్మెల్యేలకు విప్ జారీచేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.
విప్ జారీచేస్తే ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరూ టీడీపీకి ఓటు వేయాల్సి ఉంటుంది. విప్ ధిక్కరిస్తే ఆ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని కోరవచ్చనే ఉద్దేశంతో అభ్యర్థిని పోటీకి దింపాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు అంతటి సాహసానికి పూనుకుంటారో లేదో చూడాలి.