టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. కులం పేరుతో దూషించారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు, పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ ఆరోపించారు. అయితే, ఈ క్రమంలో ఇసుక రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి కులం పేరుతో దూషించారంటూ వీరాంజనేయులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పెద్దపప్పూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, గతంలో కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఈ తరహా కేసులు ఉన్నాయి. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీటి పెట్టి వైసీపీ ప్రభుత్వంపై పలు రకాల విమర్శలు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యేపై నోరూపారేశకున్నారు. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని, ర్తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎవ్వరూ ఏమీ చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని తొడకొట్టి మరీ వైసీపీకి సవాల్ చేశారు.. జేసీ.