లోకేష్ కి షాక్ ఇచ్చిన తమ్ముళ్ళు లేడీ లీడర్ కు ఘోర అవమానం

టిడిపిలో అంతర్గత పోరు రగులుతోంది. గ్రూపు రాజకీయాలకు చిరునామాగా పేర్కొన్న టిడిపిలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతుండటం ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారింది. ముఖ్య నాయకులు రెండు, మూడు గ్రూపులుగా విడిపోయి.. తమలో తామే దూషించుకునే వరకు వెళ్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే.. అనంతపురం జిల్లా శింగనమల టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. శింగనమలలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్రలో గ్రూపు రాజకీయాలు బట్టబయలయ్యాయి. శింగనమల టీడీపీ ఇంఛార్జి బండారు శ్రావణి మరియు టూ మెన్ కమిటీ సభ్యులు కేశవరెడ్డి, నరసానాయుడు ల మద్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ ద్విసభ్య కమిటీ మెంబర్లు తన తండ్రిని దూషించారని బండారు శ్రావణి ఫిర్యాదు చేశారు. నిన్న మర్తాడు గ్రామంలో యువగళం క్యాంప్ సెట్ దగ్గర బండారు శ్రావణి.. ముంటి మడుగు కేశవ రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో తన తండ్రి బండారు రవికుమార్ ను దూషించి దాడి చేశారంటూ ద్విసభ్య కమిటీ సభ్యుడు సోదరుడు శ్రీనివాసరెడ్డిపై శ్రావణి ఫిర్యాదు చేశారు. దీంతో గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ముంటి మడుగు శ్రీనివాసరెడ్డితో పాటు మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నియోజకవర్గంలో యువగళం పాద్రయాత్ర కొనసాగుతున్న సమయంలో విభేదాలు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విభేదాలు కాస్తా తారాస్తాయికి చేరాయి. ఈ నేపధ్యంలోనే టీడీపీ ఇంఛార్జి బండారు శ్రావణి ఫ్లెక్సీలను వైరి వర్గం చించివేశారని బండారు శ్రావణి వర్గీయులు ఆరోపించారు. శింగనమలలో టూమెన్ కమిటీని రద్దు చేయాలంటూ దళిత సంఘాలు లోకేష్ కు విన్నవించారు. రిజర్వ్ డ్ నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనం ఏంటని లోకేష్ వద్ద దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయ౦పై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.