నోరు జారిన పవన్ షాకిచ్చిన కాపులు

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఓ సామెత ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సల పొంతన లేకుండా పోయిందని.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే చాలా క్లియర్ గా అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ ఓటమికి కారణం.. కాపులేనట. కాపులందరూ ఆయనకు ఓటు వేసి ఉంటే.. 2019 ఎన్నికల్లో కనీసం ఒక్క గాజువాకలో అయినా గెలిచి ఉండేవారట. అంటే పవన్ కళ్యాణ్ గెలవడం కాపులకే ఇష్టం లేదని ఆయన చెప్పుకొస్తున్నారు. ఆయన ఒడిపోతే కాపులే కేరింతలు కొట్టారట. కాపుల్లో ఐక్యత లేదట. ఈ వ్యాఖ్యలపై కొందరు కాపు నాయకులు, కాపు ప్రజలు సీరియస్ అవుతున్నారు. ఆయన కాపు అయితే ఆయనకే ఓటు వేయాలని ఏమైనా రూల్ ఉందా..? ఓటు అనేది మా హక్కు.. అది మా ఇష్టం. మాకు ఎవరి పాలన బాగుంటే వారికే ఓటు వేస్తాం. మా అభిమాన నాయకుడిని గెలిపిస్తాం అంటూ స్వయంగా కాపులు పవన్ కళ్యాణ్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఇలా కాపులు పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. చంద్రబాబుతో కలిస్తే ఓటు వేసేది లేదని, పావలా, ముప్పావలాకి అమ్ముడు పోయి పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కాపు ప్రజలు తమ అభిప్రాయ వ్యక్త, చేస్తున్నారు. అన్నింటికి మించి కాపులు పొరపాటున కూడా వైకాపాకు ఓటు వేయకూడదు. ఎవరైనా జనసేనకు ఓటు వేయమని చెబుతారు. వైకాపాకు వేయద్దు అంటే జనసేనకు వేయమనా? లేక జనసేన వుండదు..తేదేపా వుంటుంది దానికి వేయమనా? అంటే జనసేన వుంటుందనే కచ్చితమైన నమ్మకం పవన్ కు లేదా. అలా వుండి వుంటే వైకాపాకు వద్దు అనే బదులు కాపులంతా జనసేనకే వేయాలని చెప్పేవారు కదా? అలా ఎందుకు చెప్పలేదు? అసలు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు..? ఆయనకు బాబు నుంచి సరైన ప్యాకేజీ అందలేదా..? పవన్ కళ్యాణ్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే హరిరామ జోగయ్య చదివారా..? అంటే దానికి అవుననే సమాధానం వస్తుంది. అసలు పవన్ కళ్యాణ రాజకీయాలు అయోమయంగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి రేపు జరగబోయే జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.