1.ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ …
3 పట్టభద్రుల స్థానాలు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు.
2.ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అధికారుల ఇళ్లలో సీఐడీ తనిఖీలు
విజయవాడ మేనేజర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న అధికారులు
3.ఎన్నికల కోడ్ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రకు రెండు రోజులు బ్రేక్
పోలీసుల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్న లోకేష్.
4.మరో వైసీపీ నేత పార్టీకి గుడ్ బై..
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జనసేనలో చేరుతారనే ప్రచారం… బీసీ సదస్సుకు కమల హాజరు.
5.మోహన్ బాబుతో సోము వీర్రాజు భేటీ..
తిరుపతిలోని మోహన్ బాబు నివాసంలో సమావేశం.. ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని విన్నపం
6.జగన్ మోహన్ నవరత్నాలు పేరిట ప్రజల నవ రంద్రాలు ముసేసారు…
వైసిపి ప్రభుత్వం గద్దె దింపాలి అంటే ప్రజలు కలసికట్టుగా వచ్చి పవన్ కి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ నేత మధు సుదన్ రెడ్డి పిలుపు
7.జనసేన బిసి కులాల ఐక్యత కోరుకుంటోంది..
వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ వెల్లడి.
8.రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే నీచులు, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే రకాలు వీళ్లు’
వివేకా హత్య విషయంలో వైసీపీ తీరుపై మండిపడిన అచ్చెన్నాయుడు.
9. స్కిల్ డెవలప్మెంట్పై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది..
సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో 5 రాష్ట్రాలు చేసుకున్న ఒప్పంద పత్రాలను విడుదల చేసినట్లు ధూళపాళ్ల నరేంద్ర స్పష్టం.
10. చిరంజీవి ఇంటికి ఎప్పుడు వెళ్లినా పవన్ ఏదో ఒక దీక్షతో పనిచేస్తుండేవాడు..
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆల్ ది బెస్ట్ పవన్ కల్యాణ్ అంటూ రాఘవేంద్రరావు అభినందనలు.