అడ్డంగా బుక్కయిన పవన్.. సోషల్ మీడియాలో పరువంతా పాయే

వైసీపీ అంటున్నట్లు గా పవన్ కల్యాణ్ వీకెండ్ పొలిటీషన్ చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారని.. అందుకే ఆయన రాజకీయాలలో అంతగా యాక్టివ్ గా లేరని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించిన మొదట్లో కనిపించిన ఫైర్ ఇప్పుడు లేదనేది కొందరు పవన్ అభిమానులు అంటున్నమాట. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం అంటూ గర్జించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు వీరమరణం పొందాల్సిన అవసరం లేదంటూ తన బేలతనాన్ని చాటుకున్నారని అంటున్నారు.వచ్చే ఎన్నికల్లో తాను ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోనని, గెలిపిస్తాననే గ్యారంటీ ఇవ్వగలుగుతారా? అని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించడం షాకింగ్‌గా భావిస్తోన్నారు. తన సభలకు వచ్చిన వారు తనకు ఓటు వేయరనే నమ్మకం పవన్ కల్యాణ్ లో బలంగా నాటుకు పోయిందని, ఆ కారణంతోనే చివరికి ప్రజలపైన కూడా విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితికి వచ్చాడని అంటున్నారు. తనను ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అని ఎవరైనా అంటే- తన జనసైనికుడి చెప్పు తీసుకుని కొడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు పవన్ కల్యాణ్.

ఇక ఈ నేపధ్యంలోనే.. పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని తగ్గించే ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ సిఎం కేఎసీఆర్ పవన్ కళ్యాణ్ కి వెయ్యి కోట్లు ఆఫర్ అంటూ.. రాధాకృష్ణకు చెందిన ప్రముఖ దినపత్రికలో ప్రచురితమై౦ది. ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించింది. అయితే.. ఈ వార్తపై పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. ఇంకోసారి ప్యాకేజీ స్టార్ – గీకేజీ స్టార్ అంటే.. చెప్పు తీసుకొని కొడతాడంటూ తమపై రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ వెయ్యి కోట్ల ఆఫర్ అంటూ వచ్చిన కధనంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. అంటే.. ఆయన మౌనంగా ఉన్నారు అంటే.. ఈ వార్తల్లో నిజం ఉందనే భావించాలని కూడా అంటున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.