పచ్చ మీడియాకి బీజేపీ వార్నింగ్ జగన్ ప్రభుత్వానికి మద్దతు

ఏపీలో పచ్చ మీడియా గురించి సిఎం జగన ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఎల్లో రాతలు అంటూ.. దుష్టచతుష్టయం అంటూ.. తప్పుడు కధనాలపై జగన్ నిప్పులు చేరుగుతూనే ఉంటారు. అసత్యాలు, కల్పితాలు వండి వార్చడం ఎల్లో మీడియాకు అలవాటేనని, ఆ ఎల్లో మీడియా వెనకున్నది ఎవరు అన్నది కూడా సిఎం జగన్ బహిరంగంగానే చెప్తూ ఉంటారు. ఇక ఈ తరుణంలోనే జీవీఎల్ నరసింహారావు కూడా ఎల్లో మీడియాపై మండిపడ్డారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ పై జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ ఎందుకు చేయడం లేదని కొన్ని పత్రికలు, టీవీ చానెళ్లు నానా రచ్చ చేస్తుందని మండిపడ్డారు. సీబీఐ ఏమైనా చేతకాని సంస్థగా భావిస్తున్నారా..? సీబీఐ తలుచుకుంటే ఏ స్థాయికి అయినా వెళుతుందని తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై రాజకీయ వ్యాఖ్యానాలు చేసి అభాసుపాలు కావొద్దని జీవీఎల్ సూచించారు. తాటాకు చప్పుళ్ళకు భయపడే సంస్థ సీబీఐ కాదని గుర్తు చేశారు. తోక పార్టీలు చేసే విమర్శలను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అలాగే తాజాగా కేంద్రప్రభుత్వం ఏపీకి వెయ్యి కోట్లు ఇవ్వడంపై కూడా కొన్ని మీడియా పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని ఓ రేంజ్ లో మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇస్తే ఎందుకు ఇచ్చిందని కొన్ని పార్టీలు అడగడం విడ్డూరంగా వింతగా ఉందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వానికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డున పడేయాలనే అభిప్రాయంతో మాట్లాడటం సరైన విధానం కాదని జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు.