వివేకా లెటర్​పై సీబీఐ కూపీ మరో బాంబ్ పేల్చిన పీఏ

వైఎస్ వివేకా కేసు రోజుకో కొత్త మలుపు తిరిగుతోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఆయన బయట ఉంటే ఏంటి లోపల ఉంటే ఏంటి కావాల్సింది విచారించడం కదా అని తాజాగా సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. అయితే.. వివేకా కేసులో
అవినాష్ రెడ్డి లేవనెత్తిన లెటర్ విషయంపై సీబీఐ కూపీ లాగుతోంది. వివేకా పీఏ కృష్ణారెడ్డిని, వంటమనిషి కుమారుడు ప్రకాశ్ లను సీబీఐ విచారించింది. అసలు ఆ లేఖను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది..? ఆ లేఖను ఎవరైనా దాచి పెట్టమన్నారా.? అంటే అవుననే అంటున్నారు వివేకా పీఏ కృష్ణారెడ్డి. ఆ లేఖను దాచిపెట్టమని నర్రా రాజశేఖర్ రెడ్డి పీఏ కృష్ణారెడ్డికి ఎందుకు చెప్పారనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. సునీత, రాజశేఖర్ రెడ్డి పీఏ కృష్ణారెడ్డిని బెదిరించారని కూడా పీఏ కృష్ణారెడ్డి చెప్తున్నారు.అసలు హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి వివేకా మృతదేహాన్ని చూసి బయటకొచ్చి మళ్ళీ లోపలికి వెళ్లలేదని, అవినాష్ రెడ్డి వివేకా మృతదేహ౦ దగ్గరకు కూడా వెళ్లలేదని పీఏ కృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు. తన కుమారుడి పెళ్లి ఆగిపోవడానికి కారణం సునీత దంపతులేనని వెల్లడించారు. అప్పటి సీబీఐ అధికారి రామ్ సింగ్ కూడా తనను దారుణంగా కొట్టారని, తాము చెప్పిన విధంగా చెప్తే.. దస్తగిరిలా నువ్వు కూడా సేవ్ అవుతావని పీఏ కృష్ణారెడ్డి వెల్లడించారు. అయినా తాను ఒప్పుకోకపోవడంతో విచారణ పేరుతో నానా రకాలుగా హింసహించారని పీఏ కృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. మరి లేఖ విషయంలో వారి నుంచి లభ్యమైన వివరాలతో ఈకేసులో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకోనున్నాయా? అనేది ఆసక్తికరంగా మారింది. వీరిద్దని విచారించిన తరువాత ఇంకెవరు సీబీఐ దృష్టిలో ఉన్నారు?ఇంకెవరైనా అరెస్ట్ లు జరుగుతాయా? అనే విషయంలో ఎప్పుడేం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.