లోకేష్ కి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్.. పదవి తుస్

రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొన్న విషయం తెలిసిందే. మొత్తం 14 నియోజకవర్గాలకు మార్చిలో పోలింగ్ జరుగనుంది. ఇందులో స్థానిక సంస్థలు-9, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు-5 ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఏకగ్రీవ విజయాలను ఖాయం చేసుకుంది. ఇప్పటికే అయిదు చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇక ఈ నేపధ్యంలోనే.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏపీ, తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు గానూ మార్చి6న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి23న పోలింగ్ జరుగనుండగా అదే రోజు కౌంటింగ్ జరుగనుంది. నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 13గా సీఈసీ నిర్ణయించింది. నారా లోకేష్, చల్లా భగీరథ రెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పీవీవీ సూర్యనారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. తెలంగాణలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ పదవీ కాలం ముగియనుంది. ఈ ఏడు స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్తాయి. అంటే త్వరలో లోకేష్ మాజీ అవుతారన్నమాట. మరి ఈసారి ఎన్నికల్లో అయినా లోకేష్ ఎమ్మెల్యే అవుతారో లేదో చూడాలి.