పేదల కోసం 52 వేల టిడ్కో ఇళ్లు శాంక్షన్ చేశా.. ఈ జగన రెడ్డికి పేదలు అంటే ఎందుకు ఇంత కక్ష్య.. అంటూ మరో సారి చంద్రబాబు సిఎం జగన్ పై నిప్పు చెరిగారు. అమరావతిలో పేదలకి సెంటు భూమి ఇస్తాడంట.. నువ్వు ఇచ్చే ఒక సెంటు భూమి దేనికి సరిపోతుందయ్యా.. ఇళ్ళు కట్టుకోలేరు.. కానీ శ్మశానం కోసం నా సమాధి సరిపోతుందని చెప్పా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో పెద్ద దుమారమే రేగుతోంది.
నిన్ను నమ్ముకుంటే పేద వారి గోచి కూడా లాక్కు౦టావు తప్ప.. పేదలకు న్యాయం చేయవని చంద్రబాబు తాజాగా అనకాపల్లిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్ల స్థలాలను చంద్రబాబు సమాధులతో పోల్చారని.. చంద్రబాబుపై పబ్లిక్ మండిపడుతున్నారు.అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు.. అలా ఉంది చంద్రబాబు చెప్పే మాటలు.. అంటూ ప్రజలు బాబును ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. నాడు నువ్వు పేదలకి ఏమిచ్చావని.. నేడు ఇస్తున్న వారిని కూడా విమర్శిస్తున్నావాని.. పబ్లిక్ నిలదీస్తున్నారు. అంగుళం భూమి కూడా లేని వారికి ఆ సెంటి భూమి అంటే గొప్ప విషయం అంటూ..సిఎం జగన నిర్ణయాన్ని ప్రజలు స్వాగతీస్తున్నారు. అమరావతిలో జగన ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. రైతుల ముసుగులో దానిని అడ్డుకోవాలని చూసింది నువ్వు కాదా చంద్రబాబు అంటూ బెజవాడ ప్రజలు చంద్రబాబుని ప్రశ్నించారు.