మేము చేస్తే ఒప్పు ఎదుటి వాడు చ్చేస్తే తప్పు అన్న రీతిలో వ్యవహరిస్తోంది.. ఎల్లో మీడియా. తాము రాసిందే వార్త.. తాము చెప్పిందే నిజం అని జనాన్ని నమ్మించడంలో ఇప్పటి వరకు నెట్టుకురాగలిగింది కానీ.. ఇకపై ఆ పప్పులు ఊడకవనే చెప్పాలి. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం. సిఎం జగన్ పై నిత్యం బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఎల్లో మీడియా.. అదే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏదైనా తప్పు చేస్తే ఎందుకు ప్రశ్నించదు. ఎందుకంటే.. ఆ బ్యాచ్ మీడియా బాబు చెప్పు చేతల్లో నడుస్తోంది కాబట్టి. ఇక విషయానికొస్తే.. గత నెలలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన మహా యజ్ఞానికి ఆయన భార్య ఎందుకు రాలేదని, సిఎం హోదాలో ఉండి కూడా మహా యజ్ఞంలో ఆయన ఒక్కడే ఎందుకు పాల్గొన్నారని ఎల్లో మీడియా ఎన్నో రకాల విమర్శలు చేశారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న హోమంలో ఆయన భార్య ఎందుకు పాల్గొనలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అవతలి వాళ్ళ వ్యక్తిగత విషయాలను విమర్శించడం, ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. వండి వార్చడంలో ఎల్లో మీడియాకి వెన్నతో పెట్టిన విద్య.
నిలకడలేమి, అభద్రత, నోటి దూల, రెచ్చగొట్టడం.. ఇవొక్కటే పవన్ కి తెలిసినవి. రాజకీయాల్లో ఎ పార్టీ అయినా ప్రజా పక్షమే ఉండాలి కానీ ఇతను చంద్రబాబు పక్షం. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని జగన్ పదేపదే విమర్శిస్తున్నప్పటికీ.. విమర్శలో నిజం లేదు అని నిరూపించుకోవడానికి అతను ప్రయత్నం చేయడం కూడా చేయడం లేదు. చంద్రబాబు పాలనలోనూ జగన్ నే విమర్శించాడు, జగన్ పాలనలోనూ జగన్ నే విమర్శిస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు కాక ఇంకేమవుతారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయన చేస్తోన్న వారాహి యాత్ర ఎవరి కోసమో కూడా రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని సెటైర్లు వేస్తున్నారు. వారాహి యాత్ర కూడా వీకెండ్ లా సాగటం ఖాయమని నెటిజన్లు అంటున్నారు.