కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి జగన్ రికార్డ్ సృష్టించిన విశాఖ పోర్టు అభినందించిన చంద్రబాబు

1.పోలవరం తొలిదశ సవరించిన అంచనాలపై నేడు ఢిల్లీలో కీలక భేటీ..
ఇప్పటికే పోలవరానికి 20,949 కోట్లు వ్యయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

2.తూర్పు తీరంలో 2వ స్థానంలో నిలిచిన విశాఖ పోర్టు అథారిటీ.।।
మునుపెన్నడూ లేనివిధంగా 73 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి.. 7 శాతం వృద్ధి నమోదు.

3. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధి నిడుబ్రోలు ప్రాంతంలో అట్టహాసంగా టిడ్కో గృహ ప్రవేశాలు…
పేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్య.

4.వివేకాని చంపిన వారు మాత్రం బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు..
మేము ఏ తప్పు చేయలేదనే వాళ్లు మాత్రం జైలులో ఉన్నారంటూ వైఎస్ విమలమ్మ ఆవేదన వ్యక్తం.

5. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్న ప్రధాని మోదీకి సిఎం జగన్ అభినందనలు..
ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుందని ఏపీ సీఎం ట్విట్టర్లో ట్వీట్.

6.నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.।।
కొన్ని రోజులు విదేశాలకు వెళ్తే వైసీపీకి దూరంగా ఉన్నానని ప్రచారం చేస్తున్నారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మండిపాటు.

7.బసవతారకం ఆసుపత్రికి జాతీయ అవార్డు…
బాలకృష్ణను అభినందించిన చంద్రబాబు.

8.అమరావతిలో ఎవరి భూమిని ఎవరికి పంచుతారు?..
బాధితులకు బాసటగా నిలవడం తమ హక్కు అని జడ శ్రావణ్ కుమార్ వెల్లడి.

9.ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అచ్చెన్నాయుడు లేఖ..
ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో జరిగే మహానాడుకు బందోబస్తు కల్పించాలని విజ్ఞప్తి.

10. పోలవరం టు అమరావతి పాదయాత్ర చేపట్టాలని సీపీఐ నిర్ణయ౦..
ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ మేరకు తీర్మానం చేసినట్లు రామకృష్ణ వెల్లడి.