భయం గుప్పిట్లో బాబు..లోకేష్ తో రాధా భేటీ పక్కా ప్లాన్

ఉన్నట్టుండి లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధాకృష్ణ ఎందుకు జాయిన అయ్యారు..? ఆయన పార్టీ మారుతున్నారు అంటూ వస్తున్న వార్తలపై చంద్రబాబు ఉలిక్కిపడ్డారా..? అసలు లోకేష్ ను కలవటానికి రాధా పీలేరుకు ఎందుకు వచ్చారు..? రాధా జనసేనలోకి వెళ్తే.. టీడీపీకి ఎంతవరకు నష్టం..? ఆయన తమతోనే ఉన్నారు..? అని నిరూపించుకోవడానికే.. లోకేష్ పాదయాత్రలో రాధా ప్రత్యక్షమయ్యారా..? ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసమని కొందరు జనసేనలో రాధా చేరబోతున్నారు కాబట్టి దాని పర్యవసానాలను చర్చించేందుకే లోకేష్ ను కలవటానికి వచ్చారని కొందరు చెబుతున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే రాధాకి మొదటి నుండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని బలమైన కోరికుంది. అయితే అది సాధ్యం కావడం లేదు.

2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో రాధా అలిగే టీడీపీలో చేరారు. అయితే టీడీపీలో కూడా టికెట్ రాకపోయినా అప్పట్లో పోటీచేసిన బోండా ఉమాకు ప్రచారం చేశారు.మళ్ళీ షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గం టికెట్ విషయమై ఏదో ఒకటి తేల్చుకోవాలనేది రాధా ఉద్దేశ్యంగా ఉంది. కొద్దిరోజుల క్రితం రాధా జనసేనలో చేరి సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీచేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. మరందులో ఎంతవరకు నిజముందో ఇప్పటివరకు రాధా ఎక్కడా చెప్పలేదు.

టీడీపీ-జనసేన పొత్తులో భాగంగానే జనసేన తరపున రాధాయే సెంట్రల్లో పోటీచేస్తారనే ప్రచారం ఎక్కువైంది. ఈ నేపధ్యంలోనే లోకేష్ పాదయాత్రలో ఉండగా రాధా కలవటం ఏమిటి అనేది అర్ధం కావటం లేదు. రాధాకు ప్రత్యామ్నాయాలు చూపేందుకే లోకేష్ పిలిపించారని పార్టీలో టాక్ నడుస్తోంది.
ప్రత్యామ్నాయం అంటే ఏమిటి ? అనేది కీలకమైపోయింది. ప్రత్యామ్నాయాలకు రాధా అంగీకరిస్తారా అనేది చూడాలి. ఏదేమైనా రాధా వ్యవహారాన్ని తేల్చాల్సింది చంద్రబాబునాయుడు మాత్రమే. ఎందుకంటే మాజీ ఎంఎల్ఏ బోండా ఉమను కాదని సెంట్రల్లో రాధాకైనా ఇంకోళ్ళకయినా టికెట్ ఇచ్చే అవకాశం లేదు. మరి భేటీ ఆంతర్యం ఏమిటో చూడాల్సిందే.