1.విశాఖలో నేడు, రేపు ‘గ్లోబల్ టెక్ సమ్మిట్’..
సీఎం వైఎస్ జగన్ వర్చువల్ ప్రారంభ ఉపన్యాసం.
2.పోలవరం ప్రాజెక్టు పనుల్లో బుధవారం మరో కీలక ఘట్టం…
దిగువ కాఫర్ డ్యామ్ పనులు విజయవంతంగా పూర్తి
3.కడప స్టీల్ ప్లాంట్ భూమిపూజపై సీఎం జగన్ హర్షం వ్యక్తం..
సజ్జన్ జిందాల్ తో కలిసి స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పాల్గొనడం ఆనందంగా ఉందంటూ ట్వీట్
4. ‘రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే..
నారా లోకేష్.. పెద్ద ఐరన్ లెగ్ అని కురసాల కన్నబాబు ఎద్దేవా.
5.చంద్రబాబు బీసీలను దగా చేస్తున్నారు.. కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారు..
అటువంటి పార్టీలో ఉండలేను.. టీడీపీకో దండం అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం తన పదవికి రాజీనామా.
6.గుడివాడలో ఆర్టీసీ హైర్ బస్సులను ప్రారంభించిన కొడాలి నాని
స్వయంగా ఒక బస్సును నడిపిన కొడాలి.
7.ఏపీ ఫైబర్ నెట్ బేసిక్ ప్లాన్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం రెడీ..
తాజాగా బేసిక్ ప్లాన్‌పై మరో49 రూ.. వడ్డింపు.
8.ఎర్రబెల్లిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
టీడీపీలో ఉంటూనే కోవర్ట్‌గా పనిచేశారన్న టీపీసీసీ చీఫ్
9.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయి…
అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.
10.రోజా ఇంటి వద్ద అరెస్టయిన టీడీపీ నేతలకు బెయిలు..
సారె, చీర ఇచ్చేందుకు మంత్రి రోజా నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన తెలుగు మహిళలను అరెస్టు చేసిన పోలీసులు.