1.ఏపీలో మరో 1425 కోట్ల పెట్టుబడులు సాకారం..
పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ వర్చువల్ గా శంకుస్థాపన.
2. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష..
ఈ ఆటలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశ0.
3.ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి..
గతేడాది వైఎస్సార్సీపీ తరఫున 40 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని స్పష్టం.
4.ఏసీబీ వలలో భీమవరం మున్సిపల్ కమిషనర్..
60 కోట్ల మేర అక్రమాస్తులు
5. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్.।।
నాలుగు దశాబ్దాల నుంచి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడని మంత్రి కొట్టు సత్యనారాయణ సెటైర్.
6.వాడుకుని వదిలేస్తాడు, చంద్రబాబు మాట కాకుండా చిరంజీవి మాట వినండి..
పవన్ కు మంత్రి రోజా సలహా
7.పవన్ కల్యాణ్, ఆయన పెదనాన్న సీఎం పదవికి పోటీపడుతున్నారు..
చంద్రబాబు చెప్పారని పవన్ మాట్లాడటం సరికాదని ద్వారంపూడి వ్యాఖ్య
8.రాష్ట్రంలో దాడులపై హోంమంత్రి ఇప్పటికీ స్పందించకపోవడం దారుణం..
గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇస్తామన్న సీపీఐ రామకృష్ణ
9.జగన్ దొంగతెలివితేటలకు అతిపెద్ద నిదర్శనం లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీ..
భూములను కొట్టేసేందుకు జగన్ కుట్రలు చేస్తున్నాడని కాలవ శ్రీనివాసులు ఆరోపణ
10.మార్గదర్శి కేసులో రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ నోటీసులు..
41ఏ కింద నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ.