ముద్రగడ పద్మనాభం కాపుల కోసం ఎంతగా శ్రమిస్తారో రాజకీయంగా అందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజకీయాలలో ప్రత్యక్షంగా లేనప్పటికీ
కాపుల కోసం , కాపు రిసర్వేషన్ల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై ఎలా దాడులు
చేయించారో కూడా తెలిసిన విషయమే అయితే. నాడు ముద్రగడపై అన్యాయంగా కేసులు బనాయించి కుటుంబాన్ని నడి రోడ్డుపైకి లాగిన
ఘటనలు ఇంకా వారిని కలచి వేస్తున్నాయనే చెప్పాలి. 2016లో తుని దగ్గర రైలు తగలబెట్టిన కేసులో ఆయన పేరు కూడా ఉంది. ఆ కేసును
ఇటీవల కోర్ట్ కొట్టేయడంతో తిరిగి పొలిటికల్‌గా యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు ఆయన. ముద్రగడ చివరిసారిగా 2009 ఎన్నికల్లో పిఠాపురం
నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.అంతకు ముందు సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా… 2004లో
అక్కడ ఓటమితో ఇక జీవితంలో ప్రత్తిపాడు నుంచి పోటీ చేయబోనని భీష్మించుకు కూర్చున్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా
ఏ పార్టీ వైపు చూడలేదు ఆయన. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి ఓపెన్ ఆఫర్లు వచ్చినా కేసు కొట్టేసిన తర్వాతేనని చెబుతూ
వచ్చారట. ఇప్పుడు ఆ మేటర్ క్లియరైనందున తిరిగి యాక్టివ్ అవడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారట. ఈ కేసుకు సంబందించి ప్రభుత్వమే
శ్రద్ద తీసుకొని కేసులో పురోగతి వచ్చేలా వ్యవహరించిందని రాజకీయ అంటున్నారు. ఇక ఆయన త్వరలో వైసీపీ చేరబోతున్నారని, అదీ కూడా
ఆయన కొడుకు కోసం మరో అడుగు ముందుకేస్తారని ప్రచారం జరుగుతోంది.
తన కుమారుడు గిరిబాబును ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నారట. ఒక వేల ఇదే గనుక జరిగితే.. ఆ సీటు
పక్కాగా వైసీపీ ఖాతాలోనే పడుతుంది. అందుకంటే ఆ నియోజకవర్గంలో ముద్రగడకు మంచి పట్టుంది. అదీ కాకా ఆయన కాపుల కోసం పోరాడే
విధానాన్ని బట్టి ఆయనకు కాపు సామాజికవర్గం నుంచి భారీగా మద్దతు ఉంది. మొత్తానికి పొలిటికల్ స్క్రీన్ పై మళ్ళీ కనిపించడానికి ముద్రగడ
ప్రయత్నాలు చేస్తున్నారన్నది మాత్రం వాస్తవం. మరి చూడాలి చివరకు ఏం జరుగుతుందో అనేది.