1.మీ ఫ్యాన్స్ తో బండ బూతులు తిట్టిస్తున్నారు.. మెస్సేజ్‌లు పెట్టిస్తున్నారు..
మీ మెస్సేజ్‌లకు లొంగిపోయే వ్యక్తిని కాదని పవన్ కు ముద్రగడ పద్మనాభం మరో లేఖ.
2.విశాఖ ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్..
పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ వై.రామకృష్ణ వెల్లడి.
3.జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం..
విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో సత్కరించిన సీఎం జగన్..
4. కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్ట౦డి.।।
కోఆర్డినేటర్, అనుబంధ విభాగాల ఇంచార్జ్ లకు విజయసాయిరెడ్డి పిలుపు.
5.శ్రీవాణి ట్రస్ట్‌లో అక్రమాల ఆరోపణలు..
శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి
6.నేను అసెంబ్లీకి వెళ్లుంటే కనీసం లక్ష ఉద్యోగాలు పడేవి..
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని అమలాపురం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ విమర్శలు
7.జగన్ పాలనలో గంటకో హత్య… పూటకో రేప్… కిడ్నాప్, అడుగడుగునా దౌర్జన్యాలు..
నేరాలు కట్టడి చేయకుండా తియ్యబోయే సినిమాపై రామ్ గోపాల్ వర్మ తో సమీక్షా సమావేశం పెట్టుకున్నాడని లోకేష్ విమర్శ.
8.ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం ఆర్జీవీ ‘వ్యూహం’ టీజర్ ముహూర్తం ఖరారు..
రేపు ఉదయ 11 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటన
9.వైజాగ్ లో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనుక్కోవచ్చు..:
చంద్రబాబు, కేసీఆర్ కు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్
10.జగన్ మళ్లీ సీఎం అయితే అథోగతి పాలే..
అధికార పార్టీకి చెందిన ఎంపీ కుటుంబానికే రక్షణ లేక వ్యాపారం కోసం పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారని టిడిపి నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శ.