ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్

సీఎం జగన్ పాలనలో సంక్షేమానికి పెద్దపేట వేస్తూ.. రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ఖాతాలో నగదును జమ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి ఏడాది వివిధ పథకాలకు నగదు విడుదల చేస్తూనే ఉన్నారు. కానీ అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా కొన్ని పథకాలకు బ్రేక్ లు పడ్డాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే వరుసగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు ఖరారు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష చేసేందుకు సీఎంవో అధికారులతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీలను ఫైనల్‌ చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి.. ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10వ తేదీ నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు రాగిజావ అమలు ప్రారంభించబోతున్నారు. అలాగే మార్చి 18వ తేదీన సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం, జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో నగదు జమ చేయనున్నారు. మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్లు ప్రకటించనున్నారు. వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు అందజేయనున్నారు. మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభించనున్నారు. మార్చి 25వ తేదీ నుంచి వైయస్సార్‌ ఆసరా.. ఏప్రిల్‌ 5వ తేదీ వరకు కొనసాగనుంది. మార్చి 31న జగనన్న వసతి దీవెన. ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు, ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం, ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం, ఇలా వరుస కార్యక్రమాలు, పథకాలు ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది.