ముగ్గురు మంత్రులకు బిగ్ షాక్ జగన్ డేరింగ్ డెసిషన్

వచ్చే ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఎం జగన్ .. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పనితీరు బాగుంటేనే మళ్ళీ వారికి టికెట్.. లేదంటే నో టికెట్ అంటూ సిఎం జగన్ ఇప్పటికి పలుమార్లు.. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులను హెచ్చరించారు. అయితే.. సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో సంచలనం రేపుతున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సమావేశమైన కేబినెట్ మీటింగ్ లో పనితీరుపై పలువురు మంత్రులను జగన్ హెచ్చరించారు. మంత్రి వర్గం నుండి తప్పిస్తానని కూడా కాంచాలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను మంత్రులు బలంగా తిప్పికొట్టాలని.. ప్రభుత్వం ఈ నాలుగేండ్లలో ఏం చేసిందో ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ఓ ముగ్గురిపై సిఎం జగన్ సీరియస్ అయినట్టు సమాచారం. పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారట. ఇక ఈ నేపధ్యంలోనే ఎన్నికల వేళ కేబినెట్ నుండి సీఎం జగన్ ఎవరిని తొలగిస్తారనేది వైసీపీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠగా మారింది. సీఎం జగన్ కేబినెట్ నుండి ఇద్దరు, ముగ్గురు మంత్రులను తొలగిస్తానని హెచ్చరించిన నేపథ్యంలో ఆ ముగ్గురు మంత్రులు ఎవరా అని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల్కు కేబినెట్ నుండి ఉద్వాసన పలుకుతారని ఏపీ పొలిటికల్ సర్కిల్స్ జోరుగా ప్రచారం జరుగుతోంది. దాడిశెట్టి రాజా స్థానంలో తోట త్రిమూర్తులుకు, చెల్లుబోయిన వేణుగోపాల్ స్థానంలో కవురు శ్రీనివాస్ కి జగన్ కేబినెట్లో అవకాశం కల్పిస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా మర్రి రాజశేఖర్ కి కూడా కేబినెట్లో స్థానం దక్కవచ్చని ప్రచారం జరగుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కేబినెట్ లో మార్పులు జరగవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.