ఏపీలో టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై తాజాగా అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది.ఈ స్కాం ఎలా సాగిందో, దీనిలో అసలు సూత్రదారులేవరో అంటూ లెక్కలతో సహా అసెంబ్లీలో సీఎం జగన్ బాబు గుట్టు విప్పారు. అమెరికా లాటరీ తరహా మోసం ఇది అని జగన్ తెలిపారు. ఈ స్కాం నడిపిన వ్యక్తి సాక్ష్యాత్తూ అప్పటి సీఎం చంద్రబాబేనన్నారు.ప్రభుత్వ ధనం 371 కోట్లు హారతికర్పూరంలా మాయమైపోయిందన్నారు. ఈ డబ్బు వివిధ షెల్ కంపెనీలకు రూటింగ్ చేసి తిరిగి వాటి నుంచి చంద్రబాబుకు వచ్చిందన్నారు. ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కాం అని విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఇది అన్నారు. కేబినెట్లో ఒకటి చెప్పి, దాని మేరకు జీవో ఇచ్చి, ఆ తర్వాత వాటికి విరుద్ధంగా ఓ ఎంఓయూ చేసుకున్నారన్నారు. చంద్రబాబు చాతుర్యం చూడాలంటే ఈ స్కామే నిదర్శనమన్నారు. జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ వంటి ఏజెన్సీలన్నీ ఈ స్కాంపై దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. స్కిల్లింగ్ పేరుతో డబ్బులు దోచుకోవడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య అన్నారు. ఏ విధంగా ఓ వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తూ అడుగులు ఎలా పడ్డాయో ప్రజలకు తెలియాలన్నారు. వందరూపాయలు పనిచేస్తానని చెప్పి పది రూపాయలు అడ్వాన్స్ తీసుకుని, దాన్ని కూడా దోచుకున్న వ్యవహారం ఇది.. అని జగన్ ఆరోపించారు. ఈ దోచేసిన సొమ్ము విదేశాలకు, తిరిగి దేశంలోకి తెచ్చి, అక్కడి నుంచి చంద్రబాబు నివాసం ఉన్న హైదరాబాద్ కు తరలించారని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు, ఆయన మనుషులు ఓ పద్ధతి, వ్యూహం ప్రకారం ఓ ముఠాగా ఏర్పడి 371 కోట్ల డబ్బు దోచేశారన్నారు. యూత్ శిక్షణ పేరుతో ఈ డబ్బు దోచేయడం బాధాకరమన్నారు. చంద్రబాబు విజన్ ఈ స్కాంలో కనిపిస్తోందన్నారు. మరి ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని పవన్ గూబ గుయ్యిమనిపించారు సిఎం జగన్.