వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి సీఎం జగన్ కీలక పదవులు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే బాలినేని చేయడంతో నానా రకాల వార్తలు తెరపైకి వచ్చాయి. బాలినేని సిఎం జగన్ తో భేటీ కూడా అయ్యారు. ఆ సమావేశలో ఎం జరిగింది అనేది.. మాత్రం రహస్యం. ఇక ఈ నేపధ్యంలోనే.. ఆయనకు రిప్లేస్ మెంట్ గా.. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయి రెడ్డి నియమితులయ్యారని ప్రచారం సాగుతోంది. విజయసాయి రెడ్డికి నెల్లూరు రాజకీయాలలో చాలానే పట్టు ఉంది. అక్కడి సమస్యలను ఆయన సునాయాసంగా పరిష్కరించగలరని, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలాంటి నాయకులు పార్టీకి అవసరం అని గుర్తించిన సిఎం జగన్ మళ్ళీ ఆయనకు ఈ బాధ్యతను అప్పగించినట్టు ప్రచారం సాగుతోంది. ఇక ఇదిలా ఉంటే.. విజయసాయి రెడ్డికి గత రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం కూడా ఓ పదవిని కట్టబెట్టింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఆయన నామినేట్ అయ్యారు.తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు పీయూష్ గోయెల్, ప్రహ్లాద్ జోషికి థ్యాంక్స్ చెబుతున్నట్లు పేర్కొన్నారాయన. 2022లో విజయసాయి రెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తొలగించిన సమయంలో కూడా ఎన్నో రకాల కధనాలు వచ్చాయి. విజయసాయి రెడ్డికి రాను రాను పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని, సజ్జల రామకృష్ణా రెడ్డి వల్లే విజయసాయి రెడ్డికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎన్నో రకాలుగా ప్రచారం జరిగింది. అయితే.. తారకరత్నమరణించిన సమయంలో చంద్రబాబు , విజయసాయి రెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. విజయసాయి రెడ్డి టీడీపీలోకి వెళ్తున్నారని.. ఇంకెన్నో రకాలుగా కథనాలు అల్లి వైసీపీకి నెగటివ్ గా ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎంపీ విజయసాయి రెడ్డికి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను అప్పగిస్తే.. ఆ నెగటివ్ ప్రచారాలకు చెక్ పెట్టినట్టు అవుతుందని రాజకీయ విశేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవ, అవాస్తవం ఏంటి అనేది.