2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా అధినాయకులు పావులు కదుపుతున్నారు. సిఎం జగన్ నమ్ముకున్న గెలుపు మంత్ర ఒక్కటే.. అదే సంక్షేమం. దానికి తోడు ఇప్పటివరకు తాము చేసిన అభివృద్దిని గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళేలా సిఎం జగన్ తన టీంని నేరుగా ప్రజల చెంతకు, వారి గడప వద్దకే పంపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సిఎం జగన్ చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఆలోచనే వేరని చెప్పాలి. ఎందుకంటే.. ఒక్కసారి ఎన్నికల ఫలితాలు వచ్చాయంటే.. మళ్ళీ ఎన్నికల సమయానికే ప్రజలు గుర్తొస్తారు. దానికి విభిన్నంగా సిఎం జగన్ ఆలోచించి.. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే ఎమ్మెల్యేలు, మంత్రులను నేరుగా ప్రజల వద్దకే పంపంచి ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ.. ప్రజలకు తామూ ఇంతవరకు చేసిన మంచిని ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ వ్యవహారంలో సిఎం జగన్ కొంతమండిపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. వారిలో దాదాపు 15 మంది గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సరిగా నిర్వర్తించలేదని, అందుకే మరోమారు సిఎం జగన్ సమావేశం పెట్టి వారిని హెచ్చరించనున్నారని, అందుకే నేడు సిఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో నేడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం అధారంగా వారికి మార్గనిర్దేశనం చేయనున్నారు. పని తీరు సరిగా లేని ఎమ్మెల్యేలపై నేడు సిఎం జగన్ తాడో పేడో తేల్చనున్నారని ప్రచారం సాగుతోంది. సిఎం జగన్ ఆ 15 మందిపై సీరియస్ గా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఆ 15 మంది ఎవరో వసారి పరిశీలిస్తే.. మంత్రి సిదిరి అప్పలరాజు, కంబాల జోగుల, సంబంగి వెంకట అప్పలనాయుడు, అదీప్ రాజు, ఉప్పలపాటి వెంకట రమణమూర్తి, గొల్ల బాబూరావ్, పీనిపి విశ్వరూప్, ఆళ్ల నాని, మేరుగు నాగార్జున, మద్దిశెట్టి వేణుగోపాల్, సుధాకర్ బాబు, కుందూరు నాగార్జున రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, శెట్టిపల్లి రఘురాం రెడ్డి, తిప్పేస్వామి.. ఈ పడిహెబు మందికి వచ్చే ఎన్నికల్లో సీటు దక్కదని ప్రముఖ మీడియాలో ప్రచారం అవుతోంది. సొ.. మరి సిఎం జగన్ తన కేబినెట్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.