సీఎం జగన్ యాత్ర షురూ…అభిమానులకు మరో పండుగ, బాబుకు ఇక చెడుగుడు

నాడు ప్రజాసంకల్ప యాత్రతో ప్రభంజనం సృష్టించిన సీఏం జగన్.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుండి సంక్షేమ, అభివృద్దితో ముందుకు సాగుతోంది. జగన్ సీఏం అయిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్లలేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తోంది. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళతారంటూ.. ఎగతాళి చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. వారి నోళ్లకు తాళం వేసే నిర్ణయం ఒకటి తీసుకున్నారు సీఏం జగన్. ఏప్రిల్ నుంచి బ‌స్సు యాత్రకు జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ప్ర‌తి మండ‌లంలో ఒక‌ట్రెండు ప‌ల్లెల‌ను ఎంచుకుని అక్క‌డే ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి నిర్వ‌హించ‌నున్నారు. ఏప్రిల్ నుంచి ఆయన నేరుగా ప్రజలను కలవనున్నారు. వారితో క‌లిసి ప‌ల్లె నిద్ర చేయ‌నున్నారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించబోతున్నారట.

వై నాట్ 175 అంటూ.. పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపిన సీఏం జగన్ .. నేరుగా ప్రజల్లోకి వచ్చి పార్టీలో ఉన్న కిందిస్థాయి నాయకుల దగ్గర నుంచి తమ అభిమానుల్లో ఆత్మస్థైర్యం నింపబోతున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ప్రతి మండలాన్ని టచ్ చేయాలనే ఆలోచనలో ఏపీ సీఎం జగన్ ఉన్నారని తెలుస్తోంది. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలనే యోచనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి.. వాటికి విపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆరోపిస్తున్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని సీఏం హోదాలో నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్ళి .. మరొక్కసారి ఆశీర్వదించాలని కొరనున్నారట సీఏం జగన్. ఇలా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు చెక్ చెప్పొచ్చనే ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉంది