ఏపీలో రాజకీయ పరిణామాలను గమనిస్తే.. అనూహ్యమైన మార్పులకు నాంది ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ హీటు మరింత రాజుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ భావిస్తున్న వేళ.. సిఎం జగన్ ఆశలకు కాస్త బ్రేకులు పడ్డాయని అందరూ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకటి సంక్షేమం, రెండు మూడు రాజధానుల వ్యూహంతో ఎన్నికలకు సిద్దం అవుతామంటూ.. అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే.. తాజాగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం.. వైసీపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఈ పాయింట్ ని బేస్ చేస్కొని టిడిపి తెగ సంబరపడిపోతుంది. ఆ పార్టీ క్యాడర్ సంబరాలలో మునిగి తేలుతున్నారు. విశాఖతో పాటుగా రాయలసీమలోని గ్రాడ్యుయేట్స్ నియెజకవర్గాలు మూడు స్థానాల్లోనూ టీడీపీ గెలిచింది. ఇప్పుడు ఈ విజయాన్ని టీడీపీ భారీగా ప్రచారం చేసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ వైపే ఉన్నారని చెప్పడానికి ఇదొక నిదర్శమనం అంటూ.. టిడిపి , జనసేన తెగ ట్వీట్ లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వై నాట్ పులివెందుల అంటూ.. టిడిపితో సహా జనసేన నాయకులు సిఎం జగన్ ని ఇమిటేట్ చేస్తూ ట్వీట్ లు చేస్తున్నారు. ఇవే ఫలితాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని చంద్రబాబు.. పవన్ చెప్పుకొచ్చారు. అయితే,.. ప్రతిపక్షాల నోళ్లను మూయించి, తమ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలని సిఎం జగన్ ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విశాఖ కేంద్రంగా ప్రజల్లో తమకు ఆదరణ..రాజధాని అంశంలో మద్దతు ఉందని చాటి చెప్పాలని భావిస్తున్నారు. ఇందుకోసం విశాఖలోనే మరో ఎన్నిక ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో విశాఖ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారింది. ఇక ఈ నేపధ్యంలోనే.. విశాఖలో పట్టు నిరూపించుకొనేందుకు వైసీపీ సిద్దం అవుతోంది.
విశాఖ పరిపాలనా రాజధానిగా చేస్తమని వైసీపీ చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించటం లేదని టిడిపి ప్రచారం మొదలు పెట్టింది. దీనిని వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. విశాఖలో ఉప ఎన్నిక తప్పదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంటా శ్రీనివాస రావు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా తన రాజీనామా లేఖ ఇచ్చినా.. స్పీకర్ మాత్రం ఆయన రాజీనామాకి ఇంకా ఆమోదం తెలపలేదు. ఈ తరుణంలో ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదించటం ద్వారా అక్కడ ఉప ఎన్నిక ఎదుర్కోవాలనేది వైసీపీ నాయకత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఎమ్మెల్యే ఓటు కీలకం కానుంది. ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదిస్తే అటు టీడీపీకి ఎమ్మెల్యే తగ్గటంతో పాటుగా విశాఖలో ఉప ఎన్నికలో గెలిచి.. తమ వైపే సాధారణ ఓటర్లు ఉన్నారని నిరూపించుకోవాలనేది వైసీపీ అధినాయకత్వం వ్యూహంగా తెలుస్తోంది. మరి ఈ దిశగా జగన్ సర్కార్ ఎలా వ్యవహరించబోతుందో చూడాలి.