మరో వైఎస్సార్‌సీపీ నేతకు అదృష్టం వరించింది. ఆడారి ఆనంద్‌కు సీఎం జగన్ డబుల్ ప్రమోషన్ ఇచ్చారు. 40 రోజుల క్రితమే విశాఖ డెయిరీ ఛైర్మన్ పదవి దక్కగా తాజాగా మరో పదవి వరించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం విశాఖ డెయిరీ ఛైర్మన్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. జనవరిలోనే విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా ఆనంద్ భాద్యతలు స్వీకరించారు. ఆయనను విశాఖ డెయిరీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోగా.. ఆ భాద్యతలు స్వీకరించారు. ఆడారి ఆనంద్ కుమార్ తండ్రి ఆడారి తులసీ రావు మరణం తర్వాత విశాఖ డెయిరీ నూతన ఛైర్మన్‌గా ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.ఆడారి తులసీరావు గతంలో టీడీపీలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆనంద్‌కు అనకాపల్లి టీడీపీ ఎంపీ టికెట్ కేటాయించగా.. ఆయన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత తన సోదరి రమాకుమారితో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇప్పుడు ఆనంద్ మూడు పదవుల్లో ఉన్నారు.. విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ బాధ్యతలతో పాటూ విశాఖ డెయిరీ ఛైర్మన్, తాజాగా ఏపీఎంఎస్‌ఎండీసీ ఛైర్మన్‌గా పదవి దక్కింది.