1.రేపు సీఎం జగన్ పోలవరం పర్యటన..
ప్రాజెక్ట్ పనుల పరిశీలన.
2.గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై సీఎం జగన్ సమీక్ష…
పలు కీలక అంశాలపై చర్చ.
3.చంద్రబాబు రాజకీయంగా అంగవైక్యంతో బాధపడుతున్నారు…
అమిత్ షాతో చంద్రబాబు భేటీపై మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్.
4.మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసుపై సుప్రీం కోర్టు విచారణ..
మార్గదర్శి చిట్ ఫండ్స్ సహా ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ.. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా.
5.టీడీపీ, బీజేపీ పొత్తు వార్తలు ఊహాగానాలే..
పొత్తు ప్రచారం బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రేనన్న బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్.
6.నా సోదరుడు వీరాంజనేయస్వామి మీ అక్రమ అరెస్టులకు, వేధింపులకు భయపడే నేత కాదు..
ఇదంతా దళిత నాయకుడైన స్వామి గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చంద్రబాబు ఫైర్.
7.దాడులు చేయడం మాకూ వచ్చు.. అనుకుంటే అరగంటలో స్కెచ్ వేస్తాం..
రెచ్చగొడితే ఊరుకునేది లేదని ఆనం వెంకట రమణారెడ్డి హెచ్చరికలు.
(స్కెచ్ వేస్తాం)
8.బట్టలు చింపేసి మరీ దాడి… దళిత ఎమ్మెల్యేకు ఇంత అవమానమా..:
దారుణంగా వ్యవహరించడం వైసిపి ప్రభుత్వ సైకోయిజానికి నిదర్శనమని అచ్చెన్నాయుడు సీరియస్.
9.ఆత్మకూరు అభివృద్ధిపైన డిబేట్ పెట్టుకుందాం.. రా ..
ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మేల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సవాల్ .
10.రాష్ట్రంలో అతిపెద్ద భూ బకాసురుడు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు ..
వాగు, కొండ పోరంబోకు, అసైన్డ్ భూములను అక్రమించుకున్నారని టిడిపి నేత జీవీ ఆంజనేయులు ఆరోపణలు.