1.నేడు సిఎం జగన్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 63 అంశాలకు కేబినెట్ ఆమోదం..
ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు కేబినెట్లో నిర్ణయ౦.
2.కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం..
సిఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్తూ.. ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం.
3.కొన్ని వేల హామీలు ఇచ్చి అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కింది..
ఈ పథకం అమలు చేశానని ధైర్యంగా బాబు చెప్పగలరా అంటూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్న.
4.వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ టెస్టుకు సీబీఐ కోర్టు అనుమతి..
లేఖపై వేలిముద్రల నిగ్గు తేలనున్న వైనం.
5.ముందస్తు ఎన్నికలపై మరింత స్పష్టత నిచ్చిన సీఎం జగన్..
రాష్ట్రంలో మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని సీఎం జగన్ వెల్లడి.
6.ఉండేది హైదరాబాద్ లో.. పోటీ చేసేది కుప్పం, మంగళగిరిలో..
చంద్రబాబు, లోకేశ్ లపై రవీంద్రనాథ్ రెడ్డి విమర్శలు.
7.పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గా బీసీ మహిళ..
అభ్యర్థిని ఖరారు చేసిన వైసీపీ.
8.చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వారాహి కదులుతుంది..
పొత్తును ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్య.
9.కొండలు, గుట్టలు దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ.. పేదలకు మంచినీళ్లు ఇవ్వడంలో లేదు..
మైలవరం, కొండపల్లి మున్సిపాలిటీల్లో తాగడానికి మంచినీళ్లు కూడా లేవని దేవినేని ఉమా విమర్శ.
10. చంద్రబాబు తమ పార్టీ నేలతలో ఏం మాట్లాడారో తెలియదు..
అమిత్ షా, జేపీ నడ్డాలతో బాబు భేటీపై స్పందించిన సోము వీర్రాజు.