కీలకంగా షమీమ్ స్టేట్మెంట్ అడ్డంగా ఇరుక్కున సునీత దంపతులు

వైఎస్ వివేకా కేసు రోజుకో కొత్త మలుపు తిరిగుతోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‍ విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ప్రకారమే వైఎస్ వివేకాను దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. హత్య చేసి ఆధారాలు చెరిపేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ఈ కేసుతో సంబంధమున్న వారంతా బయటకు వస్తారన్నారు. ఇంటి ముందు కుక్కను చంపారు, గొడ్డలి ఎక్కడ కొన్నారో కూడా సీబీఐ చెప్పిందని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అసలు ఆదినారాయణ రెడ్డికి, నర్రెడ్డి శివప్రకాష్‌ రెడ్డితో సంబంధం ఏంటి..? గుండెపోటుతో వివేకా మరణించారని తొలుత ఆదినారాయణ రెడ్డికే ఎందుకు చెప్పారు..? పైగా అప్పుడు ఆదినారాయణ రెడ్డి వివేకాకు రాజకీయ ప్రత్యర్ధి. తర్వాత అవినాష్‌ కు చెప్పి అక్కడికి వెళ్లమనటం వెనుక వ్యూహమేంటి..? వివేకా రాసిన రక్తపు మరకలున్న లేఖ గురించి పీఏ కృష్ణారెడ్డి సునీత దంపతులకు చెప్పగా.. ఆ లేఖను గోప్యంగా ఉంచాలని,తాము వచ్చేవరకు ఎవ్వరికీ చూపించొద్దని వారు చెప్పటం వెనక రహస్యమేంటి? ఆ లేఖను అవినాష్ కి చూపించి ఉంటే.. అది హత్యే అని తెలిసేది..ఎవరూ మృతదేహాన్ని తాకేవారు కాదుగా? చంద్రబాబు హయాంలో జరిగిన విచారణలో అసలు లేఖ ప్రస్తావనే లేదెందుకు? ఇంతకాలం వివేకా రెండో భార్య స్టేట్మెంట్ ని సీబీఐ ఎందుకు రహస్యంగా ఉంచింది..? అసలు ఆస్తి గోడవల కోణంలో సీబీఐ ఎందుకు దర్యాప్తు కొనసాగించట్లేదు..? వివేకా బావమరుదులు రెండో భార్య షమీమ్‌ ను ఎందుకు బెదిరించారు..? అయితే షమీమ్‌ కి ఎంతో కొంత నిజం తెలిసే ఛాన్స్ ఉందా..? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

2012లో రోడ్డు ప్రమాదానికి గురైన వివేకాను చూసేందుకు వెళ్లిన షమీమ్ను శివప్రకాశ్ రెడ్డి ఇంట్లోకి రానివ్వలేదు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డిలతో ముప్పు ఉన్నందునే షమీమ్ హైదరాబాద్ లో తన చిరునామా కూడా గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివేకా ఇద్దరు బావమరుదులు తనను తీవ్రంగా బెదిరించారని వారితో తనకు తన కుమారుడికి ముప్పు ఉందని షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూ స్పష్టం చేశారు. వివేకాకు కూడా ఆయన ఇద్దరు బావమరుదుల నుంచే ముప్పు ఉండేదని చెప్పారామె. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు ఆయన హత్య వెనక ఎంత బలంగా ఉండవచ్చో తెలియకమానదు.