ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న వైఎస్ వివేకా హత్య కేసులో రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసు విచారణలో పూటకో మలుపులు తిరుగుతోంది. అసలు ఈ కేసు ఎటు నుండి ఎటు వెళ్తుందో కూడా అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ఇక ఈ నేపధ్యంలోనే.. దస్తగిరికి షాకింగ్ న్యూస్ ఏంటంటే.. దస్తగిరి బెయిల్ ను రద్దు చేయాలని అప్రూవర్ గా మారడాన్ని వ్యతిరేకించాలని వివేకా పీఏ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వివేకాను చంపింది తానేనని స్వయంగా దస్తగిరి చెప్పినప్పటికీ.. ఆయనను జైలులో ఉంచకుండా.. బయట ఉంచడం ఏంటని.. ఎప్పటి నుంచో భిన్నమైన వాదనలు వస్తున్నాయి. దస్తగిరిని నిందితుడిగా కాకుండా అప్రూవర్ గా చూస్తూ ఆయనకు క్షమాభిక్ష పెట్టించిన సీబీఐ నిర్ణయంపై ఇతర నిందితులు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో వివేకా పీఏ కృష్ణారెడ్డి దస్తగిరికి క్షమాభిక్ష రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిద్దమవుతుండగా.. సునీతరెడ్డి సడన్ ఎంట్రీ ఇచ్చి.. ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అసలు దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేయడానికి కృష్ణారెడ్డికి ఏం అర్హత ఉందని సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కృష్ణారెడ్డి పిటిషన్ లో సునీత ఇంప్లీడ్ అయ్యారు. ఆమె పిటిషన్ ను సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మే 19న సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అంతేకాకుండా వివేకా కుమార్తె సునీతను ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేయాలని కృష్ణారెడ్డి కోరుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సునీత దంపతులను ప్రాసిక్యూట్ చేయాలని కృష్ణారెడ్డి ఎందుకు కోరుతున్నారు…? రాజశేఖర్ రెడ్డిపై కృష్ణారెడ్డికి ఏమైనా అనుమానం ఉందా..? హత్య జరిగిన రోజున ఘటనా స్థలంలో లెటర్ దాయమని పీఏ కృష్ణారెడ్డికి చెప్పింది సునీత భర్త రాజశేఖర్ రెడ్డేనని స్వయంగా కృష్ణారెడ్డి చెప్పారు. అసలు ఆ లెటర్ ను సీబీఐ కోర్టుకు ఎందుకు సమర్పించలేదు..? ఈ లెటర్ కి రాజశేఖర్ రెడ్డి కి ఏంటి సంబందం.. ఇలా ఎన్నో తికమక ప్రశ్నలకు ఎప్పుడు సమాధానం వస్తుందో చూడాలి.