2019 ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో ధీమాతోను, అహంకారం వల్లే తాను ఓడిపోయానని అలాగే పార్టీ కూడా ఓడిపోయిందని ఆ బలుపు వల్లే ఓడిపోయాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు పథకాలు ఇచ్చాం, వీర పథకాలు ఇచ్చాం, వీర తిలకాలు దిద్దుకొని ఊరేగామని..కానీ ఓడిపోయామని..కానీ కాళ్లు పట్టుకొని ఒక్క ఛాన్స్ అని వైసీపీ పార్టీ గెలిచిందని అంటూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. మేం ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ ఇచ్చాం కదాని..వీర తిలకాలు దిద్ది ఊరేగిస్తూన్నారని ఊరేగాం కానీ వైసీపీ నేతలు మాత్రం గెలిపించండమ్మా అంటూ ప్రజల కాళ్లు గడ్డాలు పట్టుకుని గెలిచేశారు అంటూ ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం దేవినేని ఉమా చశీనా ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో బర్నింగ్ పాయింట్ గా మారాయి. ఇక ఈ నేపధ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో తండ్రీ కొడుకులు, నందిగామలో వసూలు బ్రదర్స్ కొండలు గుట్టలు దోచుకున్నారంటూ విమర్శలు సంధించారు. ఇసుక విషయానికొస్తే నందిగామ, మైలవరం , జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యే లు నెలకు ఏటు కోట్లు పంపిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.