నారా లోకేష్ పాదయాత్రలో మరోమారు అపశృతి చోటుచేసింది. బందోబస్తు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన లోకేష్ పాదయాత్రలో చోటు చేసుకుంది. గంగాధర్ నెల్లూరులో మధ్యాహ్నం బ్రేక్ సమయంలో భోజనం తిన్న కొద్దిసేపటికే హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుకు గురి కావడంతో పక్కనే ఉన్న పోలీసు సిబ్బంది హుటాహుటిన పోలీసు వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రమేష్ ను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు. ఇంకా ఎంతమందిని పుట్టన పెట్టుకుంటారు అంటూ.. పబ్లిక్ మండిపడుతున్నారు.
నాడు చంద్రబాబు కందుకూరు సభలో 8 మందిని గుంటూరులో ముగ్గురు.. ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో ఇలా మరణించడం పట్ల పబ్లిక్ చంద్రబాబు, లోకేష్ ని నిలదీస్తున్నారు. టిడిపికి మైలేజ్ రావడం కోసం ఇంకెంతమందిని పొట్టనపెట్టుకుంటారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కాదని, పోలీసులు పెట్టిన రూల్స్ ని అతిక్రమనించి.. ఇష్టమొచ్చినట్టు చేసుకుంటాం. మా హక్కు అంటూ పోతే ఇలా అమాయక ప్రజలు బలి అవడం తప్పా.. పేద ప్రజలకు మీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటున్నారు. ఇకనైనా షరతులతో కూడిన విధంగా మసులుకొని, పోలీసులకు సహకరిస్తూ.. ఏ ఒక్క ప్రాణం పోకుండా పాదయాత్రలు చేస్తే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు