బీజేపీకి విడాకులు.. చంద్రబాబు పార్టీతో పెళ్లి పవన్ కల్యాణ్ ట్వీట్ గన్నవరం టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

1.బీజేపీకి విడాకులు ఇస్తారు.. చంద్రబాబు పార్టీని పెళ్లి చేసుకుంటారు…
జనసేన పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుంది.. చంద్రబాబు నిర్దేశం మేరకే పవన్ ఢిల్లీ వెళ్లారని మంత్రి రాంబాబు ఆరోపణ.

2.తోడేళ్లలాగా నాకు అంగబలం, అర్థబలం, మీడియా బలం ఉండకపోవచ్చు..
మీ బిడ్డకు దేవుడి దయ, మీ చల్లనిదీవెన ఉన్నాయి నన్ను ఎదుర్కోలేక చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని సిఎం జగన్ వ్యాఖ్య.

3.గన్నవరం టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు..
పార్టీ కార్యక్రమాలకు తమను పిలవడం లేదంటూ బాహాబాహీకి దిగిన టీడీపీ కార్యకర్తలు.

4.రేపటి నుంచి ఏడు లక్షల మంది గృహ సారథులు కోటి 60 లక్షల ఇళ్లకు వెళ్ళనున్నారు..
జగన్ పాలనపై ప్రజలందరి వద్ద అభిప్రాయాలు తీసుకుంటారు. దేశంలో ఎవరూ చేయని కార్యక్రమం మేము చేస్తున్నామన్న సజ్జల.

5.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంది..
ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని సిఎం జగన్ వెల్లడి.

6.జగనన్న ఇది మీరు పెట్టిన భిక్ష..
బీసీ మహిళనైన తనను మంత్రిని చేశారంటూ విడదల రజని భావోద్వేగం.

7.సహనం, సౌశీల్యం కలిగిన నేత నాదెండ్ల మనోహర్..
నాదెండ్ల పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కల్యాణ్ ట్వీట్.

8.జగన్ తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ పెద్ద జోక్..
ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినంత వైద్య సిబ్బంది, పరికరాలు, మందులు సమకూర్చలేదనన్న టీడీపీ నేత ఆలపాటి రాజా.

9.నాలుగేళ్లలో లక్షల ఎకరాలు కొల్లగొట్టిన జగన్, ఇప్పుడు పేదల సాగులో ఉన్న చుక్కల భూములపై పడ్డాయి..
హైకోర్టు నియమించిన కమిటీ నివేదిక వచ్చేవరకు ఆగకుండా చుక్కల భూముల చిక్కులను ఎలా విప్పుతుందో చెప్పాలన్న పిల్లి మాణిక్యరావు.

10.ఏపీలో ప్రభుత్వ వాహనాలకు AP 40G సిరీస్
ఎంవీఐ చట్ట సవరణకు నోటిఫికేషన్