రోడ్ షోలో బాబుకి డబుల్ షాక్ టీడీపీకి ఇదేమీఖర్మ, బైబై బాబూ

కృష్ణాజిల్లాలో జరుగుతున్న చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు వెనుక ర్యాలీగా వస్తున్న గుంపులోకి ఓ వైసీపీ కార్యకర్త తమ జెండాతో దూసుకొచ్చాడు. అనంతరం వైసీపీ జెండా ఊపుతూ హల్ చల్ చేశాడు. దీనిని గమనించిన టీడీపీ కార్యకర్తలు అతనిని అడ్డుకుని చితకబాదారు. అతనికి తీవ్రంగా గాయాలు కావడంతో దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. అక్కడే వున్న పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జిల్లా ఎస్పీతో మాట్లాడారు.దీంతో ఆయన రోడ్ షోకి కాసేపు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే.. హనుమాన్ జంక్షన్ లో చంద్రబాబుకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో బాబు హయాంలో గన్నవరం నియోజకవర్గంలో పలు సమస్యలను ఎట్టి చూపుతూ.. అక్కడి ప్రజలు బ్యానర్లు కట్టారు. అయ్యా చంద్రబాబు మాకెందుకీ ఖర్మ.. మీకెందుకు ఘన స్వాగతం అంటూ ఫ్లెక్సీలలో ప్రస్తావించారు. డెల్టా షుగర్ ప్యాక్టరీని మూసివేయడం, మల్లవల్లి ఏపీఐఐసీ, గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు తీసుకుని అర్హులైన వారికి పరిహారం ఇవ్వకుండా, విజయవాడ ఇన్నర్ రింగురోడ్డు నిర్మాణంలో ఓ రౌడీ షీటరు హోటల్ కూల్చకుండా రామవరప్పాడు కాల్వగట్లపై పేదల ఇళ్ళు కూల్చడం, హుదూద్ బాధితుల సాయం కోసం 50 లక్షలు విరాళంగా సేకరించి లోకేష్ కు ఇస్తే మాయం చేసారు, పోలవరం కాల్వ, బ్రహ్మయ్య లింగం చెరువు అభివృద్ది అంటూ సామంత మంత్రితో మట్టి దోపిడీ చేసినందుకు, లక్ష ఇళ్ళ పట్టాలంటూ పేదలకు స్థలాలు ఇవ్వకుండా మోసం చేసినందుకు స్వాగతం పలకాలా అంటూ నిలదీస్తూ చంద్రబాబు వచ్చే దారిలో పలుచోట్ల ఈ ప్లెక్సీలు కట్టారు..ఇదేమీఖర్మ చంద్రబాబు, బైబై బాబూ అంటూ రాశారు