కాపులపై టీడీపీ కక్ష్య బాబుతో పవన్ కలిసినా కాపులు కలవరు ఈనాడు రామోజీరావు గలీజు రాతలు

1.ఏపీ వాసులకు అలర్ట్..
రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడి.

2.భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా 4600 కోట్ల పెట్టుబడి రాబోతుంది..
నాలుగేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని భూ సేకరణ కేసులు పరిష్కరించామని పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ స్పష్టం.

3.తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం హర్షణీయం..
నాడు ముద్రగడ కుటుంబం పట్ల బాబు చాలా దుర్మార్గంగా వ్యవహరించారని కురసాల కన్నబాబు ధ్వజ౦.

4.కాపు ఉద్యమంలో టీడీపీ ప్రభుత్వం కాపు నేతలందరిపై 69 కేసులు పెట్టించారు..
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిసినా కాపులు కలవరని మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు.

5.జగజ్జననని చిట్ ఫండ్స్ పేరుతూ ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో ఆదిరెడ్డి కుటుంబం అక్రమాలకు పాల్పడింది..
ఆదిరెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్స్ చూపించారు.చిట్ ఫండ్స్ చట్టం సెక్షన్-5 ప్రకారం అరెస్టులు జరిగాయని ఎంపీ భరత్ క్లారిటీ.

6. రైతులను అడ్డంపెట్టుకుని ఈనాడు రామోజీరావు గలీజు రాతలు రాస్తున్నారు..
నిన్న వర్షం కురిస్తే.. ఈరోజే పరిహారం ఇవ్వలేదన్నట్టుగా ఈనాడు రాతలు ఉన్నాయంటూ మంత్రి కాకాణి ధ్వజ౦

7.పోలవరంకు ఇవ్వాల్సింది 1,249 కోట్లు మాత్రమే..
రీయింబర్స్ చేయాల్సిన నిధుల వివరాలు తెలిపిన కేంద్రం.

8.ఎవరెన్ని విమర్శలు చేసినా స్పందించబోను..
చంద్రబాబుకు తెలిపిన రజనీకాంత్.

9.జగన్ సీజనల్ క్రిమినల్..
కోడి కత్తి, వైఎస్ వివేకానంద కేసులను టీడీపీ పైకి నెట్టి గెలిచారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన ఆరోపణలు.

10.వైసీపీ నేతల చిట్ ఫండ్ కంపెనీలలో ఎందుకు తనిఖీలు చేయడం లేదు..
గత నాలుగేళ్లుగా ఏపీలో కక్షపూరిత ధోరణిని చూస్తున్నామని ఆదిరెడ్డి భవానీ ఆవేదన.