చంద్రబాబుకి సొంత పార్టీ నేతల నుండే వ్యతిరేకత మొదలవుతుంది. ఏకంగా చంద్రబాబునే ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే.. బాబు గారి పరిస్థితి ఎక్కడికి దిగజారిందో ప్రజలే అర్ధం చేసుకోవాలి. తాజాగా జేగ్గంపేటలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన బాబుకు ఘోర అవమానం ఎదురయ్యింది. బాబు.. మీరు ఏపీలో ఇల్లు కట్టుకొని, ఇక్కడే మీ ఫ్యామిలీతో ఉండాలని బాబుకు ఓ టీడీపీ మాజీ సర్పంచ్ క్లాస్ పీకారు. దాంతో చంద్రబాబు దెబ్బకు తెల్లమోహం వేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలే.. ప్రస్తుతం వైసీపీ వాళ్ళకి అస్త్రంగా మారాయి. దరిద్రానికి డెఫినిషన్ చంద్రబాబు అంటూ వైసీపీ నేతలు బాబును గట్టిగా ఆడేసుకుంటున్నారు. ఆఖరికి మీ పార్టీ నేతతో క్లాస్ పీకించుకున్నావని, నువ్వు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడ పాదయాత్ర చేస్తున్నాయవంటూ వైసీపీ నాయకులు లోకేష్ కి కౌంటర్ ఇస్తున్నారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. మాజీ సర్పంచ్ చేత క్లాస్ పీకించుకున్నాడు. ఇంత కంటే దరిద్రం ఉంటుందా అని సెటైర్లు వేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్ విగ్రహాలను కూలుస్తామని కొందరు టీడీపీ నేతలు చెబుతున్నారని.. దమ్ముంటే వైఎస్సార్ విగ్రహాలను టచ్ చేయండి ఎలా ఉంటుందో చూస్తారంటూ వైసీపీ నేతలు మాస్ వార్నింగ్ లు ఇస్తున్నారు. జగన్ డిఎన్ఏ రాయలసీమ.. లోకేష్ డిఎన్ఏ తెలంగాణ.. అంటూ తాజాగా కొడాలి నాని కూడా ఓ రేంజ్ లో లోకేష్ కు కౌంటర్ లు ఇచ్చారు. మరి ఆ టిడిపి నేత ప్రశ్నించిన విధంగా చంద్రబాబు ఇకనైనా ఏపీలో స్థిరపడతారో లేదో చూడాలి.