టిడిపికి పూర్వ వైభవం రావాలంటే.. ఇక చంద్రబాబు వల్ల కాదని, ఆయన తనయుడు లోకేష్ వల్ల కూడా కాదని.. స్వయంగా తెలుగు తమ్ముళ్ళే అంటూ ఉంటారు. అయితే.. ఈ వయసులో కూడా చంద్రబాబు తమ పార్టీని గాడిలో పెట్టాలని పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పాలి. అయితే.. రాష్ట్రంలో ప్రధానంగా ప్రజల నోట నుండి వినిపిస్తోన్న మాట ఏంటంటే.. టిడిపికి తిరిగి పూర్వ వైభవం రావాలంటే.. జూనియర్ ఎన్టీఆర్ రావాలని. ఆయన వస్తే టిడిపి మళ్ళీ పుంజుకుంటుందని అంటున్నారు. అయితే.. నిన్న చంద్రబాబు మచిలీపట్నం పర్యటనలో ఆయనకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సెగ తగిలింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలను ప్రదర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ బాబు కాన్వాయ్ ఎదుట నినాదాలు చేశారు. వీరి నినాదాలు, ఫొటోలు చూసి.. చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నినాదాలు చేసిన వాళ్లను ఈడ్చిపడేయాలంటూ టీడీపీ నేతలను ఆదేశించారు. ఎన్టీఆర్ ఫొటో పట్టుకున్న యువకుడిపై చంద్రబాబు మనుషులు దాడి చేశారు. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కనబడకూడదని చంద్రబాబు హుకుం జారీ చేశారు. మచిలీపట్నంలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో జూ.ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులు చేస్తున్నవారిని కొల్లు రవీంద్ర, అనుచరులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులకు తొపులాటలు జరిగాయి. వచ్చే ఎన్నికల్లో బాబుని ఈడ్చి పడేస్తామని జూనియర్ ఎన్టీఆర్ లు సవాల్ చేశారు. అయితే.. ఇలాంటి చేధు అనుభవమే చంద్రబాబుకి గతంలో ఎదురయ్యింది. ముఖ్యంగా కృష్ణాజిల్లాలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం విశేషం. మరి నేడు చంద్రబాబు గుడివాడ పర్యటన చేయనున్నారు. కొడాలి నాని అడ్డాలో చంద్రబాబుకి ఎలాంటి అనుభవాలు ఎదురావుతాయో చూడాలి.