జగన్ సర్కారుకి మాజీ జేడీ థాంక్స్ పవన్ గాలి తుస్

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఉన్నది ఉన్నట్టు.. ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి ఆయన. ఏదైనా నిర్మొహమాటంగా తేల్చి చెప్పేస్తారు. ఆయన తాజాగా జగన్ సర్కారుకి థాంక్స్ చెప్పారు. చుక్కల భూముల సమస్యలను పరిష్కరించే కార్యక్రమానికి సీఎం జగన్ ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన సభలో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న చుక్కల భూముల సమస్యను క్లియర్ చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. భూయజమానులకు అవసరమైన సరిచేసిన పత్రాలు త్వరలో లభిస్తాయని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. సీబీఐ మాజీ జేడీ ట్వీట్ పై వైసీపీ సోషల్ మీడియాలో స్పందించింది. థాంక్యూ లక్ష్మీనారాయణ గారూ అంటూ బదులిచ్చింది. ఇది జగనన్న ప్రభుత్వం…. మన రైతన్న ప్రభుత్వం అని పేర్కొంది. దశాబ్దాల నాటి చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపించి రైతుల భూములకు సర్వ హక్కులు కల్పించిన రైతు బాంధవుడు సీఎం జగన్ అని వైసీపీ కీర్తించింది. ఇదీ… రైతన్నల పట్ల జగనన్న ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని పేర్కొంది.

అయితే.. ప్రస్తుతానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. ఆయన గతంలో జనసేన తరుపున పోటీ చేసి ఓటమి పాలయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చక ఆయన పార్టీ నుండి బయటకొచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని, తన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుంచే పోటీ చేస్తానని ఆయన ఇప్పటికే అనేక మార్లు చెప్పుకొచ్చారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలిపారు. తన ఆశయాలకు ఏ పార్టీ అనుకూలంగా లేకపోతే, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు.