సీఎం జగన్ తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే భేటీ..బాబును నమ్మి మోసపోయా

1.త్వరలోనే విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుపుతా౦..
ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని మంత్రి గుడివాడ వ్యాఖ్య.

2.చంద్రబాబు హోల్ సేల్ గా అవినీతి చేశాడు కాబట్టే.. ప్రజలు హోల్ సేల్ గా ఇంటికి పంపించారు..
లోకేష్ యువగళం పాదయాత్రను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని బొత్స సెటైర్

3.చంద్రబాబును నమ్మి మోసపోయిన వారు టీడీపీలో చాలా మంది ఉన్నారు…
నేను కూడా బాబును నమ్మి మోసపోయానంటూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సంచలన వ్యాఖ్యలు.

4.సీఎం జగన్ తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ భేటీ..
ఇటీవలే టీడీపీకి రాజీనామా.

5.కన్నాకు పార్టీ సముచిత గౌరవం ఇచ్చింది..
ఏకపక్షంగా సోము వీర్రాజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్య

6.100రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించడం గర్వించతగ్గ విషయం..
సంతోషకరమైన విషయమన్న చంద్రబాబు

7.ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారథి…
టీడీపీలో కొత్త వ్యవస్థ.. ప్రకటించిన చంద్రబాబు.

8.మంగళగిరిలో గెలవలేని వ్యక్తి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాడంటా…
లోకేష్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి చవిచూస్తుందని బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి ఫైర్.

9.మూడు రాజధానుల పేరిట సీఎం జగన్ ఏపీ ప్రజలకు మూడు నామాలు పెట్టారు..
వివేకా కేసులో ఇరుక్కొని వాటి వాసన కడుక్కోలేకపోతున్నారని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు.

10.సీమపై ప్రేమలేని జగన్ రాయలసీమలో ఎలా పుట్టారు?…
రాయలసీమలో వ్యవసాయ రంగాన్ని నీరుగార్చారని, రైతులను సీఏం జగన్ దగా చేశారని లోకేష్ ఆరోపణ.