ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ నాయకులు జంపింగ్ లకు సిద్దం అవుతున్నారు. ఆ పార్టీలో నేతలు ఈ పార్టీలోకి.. ఈ పార్టీలో ఉన్న నేతలు ఆ పార్టీలోకి.. ఇలా పార్టీలలో తమకు ప్రాధాన్యత లభించటలేదంటూ.. పార్టీలు మారుతున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు తిరిగి టీడీపీ గూటికి చేరుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీని వదిలి వైసీపీలో చేరిన ఎస్సీవి నాయుడు తిరిగి టీడీపీలోకి చేరుతున్నారు. టీడీపీ తనను నమ్మించి మోసం చేసిందని ఆరోపిస్తు 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేసిన ఆయన ఆ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదంటూ తిరిగి టీడీపీలో చేరుతున్నానని తెలిపారు. గడిచిన నాలుగేళ్లుగా అధికార వైసీపీలో తనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడం పట్ల ఎస్సీవి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే టీడీపీలో చేరుతున్నానని తెలిపారు. ఇటీవలే చంద్రబాబు నాయుడు కలిసిన ఎస్సీవీ నాయుడు..బాబు అంగీకారం లభించటంతో తిరిగి తన సొంతగూటికి చేరనున్నారు. ఆత్మీయులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెలలోనే టీడీపీలో చేరనున్నారు. దీని కోసం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇక టీడీపీ కండువా కప్పుకోవటానికి రెడీగా ఉన్నారు. మరి ఈయన ఇప్పుడు టిడిపి లోకి చేరిన తర్వాత అయినా ప్రాధాన్యత దక్కుతుందో లేదో అనేది చూడాలి.