పవన్ కల్యాన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా పవన్ కల్యాణ్ భేటీ అవుతారని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ సమావేశం లేకుండా పవన్ కల్యాణ్ తిరుగుపయనమయ్యారు. పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టిపరిస్థితుల్లో చీలనివ్వబోమని ఆ ఒక్క మాటే అంటున్నారు తప్ప మరే విషయాన్ని పవన్ ప్రస్తావించట్లేదు. మరోవైపు కర్ణాటక ఎన్నికల నేపధ్యంలో పవన్ ను ఢిల్లీ పిలిపించుకున్నారని వార్తలు వచ్చాయి. ఎన్నో ఆశలతో ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ కి చివరికి నిరాశే మిగిలింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై పబ్లిక్ అనేక రకాల ప్రశ్నలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను అమిత్ షా గెట్ ఔట్ అన్నారని, అందుకే పవన్ మొహం మాడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జేపీ నడ్డాతో ఎం మాట్లాడారో ఏపీ ప్రజలకు తెలియాల్సి ఉంది.. అక్కడ ఎం జరిగిందో.. రాష్ట్ర ప్రజలకు చెప్పాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు.