ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి కొత్తగా మూడు ఫిషింగ్ హార్బర్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ఇందుకుగాను 240 కోట్లను కేటాయిస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల స్పష్టం చేశారు. అలాగే నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో 288 కోట్లతో మరో హార్బర్ నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లా ఓడరేవు, గుంటూరు జిల్లా నిజాంపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, మచిలీపట్నంల దగ్గర నాలుగు షిఫింగ్ హార్బర్ల నిర్మాణానికి ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎఫ్‌ఐడీఎఫ్) కింద ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వీటికి రాయితీతో పాటూ.. ఒక్కో ప్రాజెక్టుకు 150 కోట్లు అందిస్తామన్నారు. 73 కోట్లతో విశాఖజిల్లా భీమిలి, రాజయ్యపేట, విజయనగరం జిల్లా చింతపల్లి వద్ద ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.