ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. చాలా మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి మద్యం అమ్మకాల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. జగన్ ప్రభుత్వం కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. బూమ్, బూమ్.. ప్రెసిడెంట్ మెడల్ ఇంకా ఇలాంటి కొత్త బ్రాండ్ లు మాత్రమే ఏపీలో అమ్మకాలు జరుగుతున్నాయి. కేవలం కొన్ని పాత బ్రాండ్ లు మాత్రమే అక్కడక్కడ దార్చనమిస్తున్నాయి. అయితే నిజానికి ఈ కొత్త బ్రాండ్ లకు అనుమతినిచ్చింది గత టిడిపి ప్రభుత్వమేనని వైసీపీ ప్రభుత్వం అంటోన్న మాట. మరి కొందరు అయితే చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన డాక్యుమెంట్స్ తో సహా వివరాలు మీడియా ముందు ఉంచుతున్నారు. కానీ తప్పు మొత్తం వైసీపీ ప్రభుత్వంపైనే నెట్టేస్తుందో టిడిపి. ఇక విషయానికొస్తే.. ఈ కొత్త బ్రాండ్ల విషయంలో ఏపీ మందు ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో మద్యం అంత రుచిగా లేవని పక్క రాష్ట్రాలకు వెళ్ళి మరీ డ్రింక్ చేసి వస్తున్నారు. అంతేకాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా మద్యాన్ని తరలిస్తున్నారు. ఇలా మందుబాబులు ఎన్నో కష్టాలు పడుతున్నారు.
ఇక ఈ నేపధ్యంలోనే ఏపీ మందుబాబులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఏపీలో ఒరిజినల్ బ్రాండ్స్‌ను తీసుకురానుందట… ఏపీ ప్రభుత్వం.
రేటు ఎక్కువైనా సరే కొత్త బ్రాండ్స్ వస్తే మంచిదని కొందరు మందు బాబులు తమ అభిప్రాయం తెలుపుతున్నారు. ఇప్పుడున్న అసంతృప్తి పూర్తిగా తగ్గిపోతుందని ప్రభుత్వం ఆలోచిస్తోందట. జగన్ ప్రభుత్వం ఇలా చేయడం వల్ల ప్రతిపక్షాలు తమపై చేస్తున్న ఆరోపణలు చెక్ పెట్టినట్టు అవుతుందని అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు.. మద్యం షాపుల్లో ఇప్పుడు ఆన్‌లైన్ పేమెంట్లను కూడా అందుబాటులోకి తీస్కురావడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుందట. ఏపీలో కొత్త బ్రాండ్స్ వస్తున్నాయని ప్రచారం అయితే సాగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రావలసి ఉంది. చూడాలి మరి జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది.