కావలి గ్రీష్మ ఏంటి వైసీపీలో చేరడం ఏంటి..? అని ఆశ్చర్యానికి గురయ్యారా..? ప్రస్తుతం రాజాం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ రగడను బట్టి చూస్తే ఇలా చెప్పక తప్పదని అంటున్నారు.. పలువురు రాజకీయ విశ్లేషకులు. అసలు ఆమె వైసీపీలో వెళ్ళబోతున్నారని ఎందుకు ప్రచారం జరుగుతుందో తెలుసుకోవాలంటే.. అసలు రాజాం నియోజకవర్గ టిడిపిలో ఎం జరుగుతుందో పరిశీలన చేయాల్సి ఉంది. టీడీపీ నేత మాజీ మంత్రి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ.. టీడీపీ మహానాడులో తొడగొట్టి సంచలనం సృష్టించారు. తన పదునైన మాటల ద్వారా చిన్న వయసులోనే టీడీపీ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ నేతల నుంచి ఘాటు విమర్శలే ఎదుర్కొన్నారు. అయినప్పటి కీ గ్రీష్మ వెనక్కి తగ్గలేదు. గ్రీష్మ తల్లి ప్రతిభాభారతి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు గెలుపొందారు.ఆ తర్వాత 2004 2009 2014 ఎన్నికల్లో ప్రతిభాభారతి రాజాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆమెకు టీడీపీ సీటు ఇవ్వలేదు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో కి వచ్చిన కొండ్రు మురళీ మోహన్ కు సీటు ఇచ్చింది. అయితే ఆయన కూడా ఓడిపోయారు.ప్రస్తుతం ప్రతిభాభారతి రాజకీయాలలో సైలెంట్ గా ఉంటూ తమ బాధ్యతలను గ్రీష్మకి అప్పచెప్పారు. ఈ నేపధ్యంలోనే గ్రీష్మ రాజాం సీటుని ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజాం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని… రాజాం టీడీపీ ఇంచార్జిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. డబ్బులు గురించి తనకు ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు.అయితే గ్రీష్మ ఇంతగా చెబుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి మరొకసారి కొండ్రు మురళీ మోహన్ టికెట్ ఆశిస్తున్నారని.. ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందని లోకల్ టాక్. ఈ క్రమంలోనే.. గ్రీష్మను వైసీపీలో చేర్చుకోవడానికి ఆసక్తి గా ఉందని ప్రచారం సాగుతోంది. గ్రీష్మకు రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సీటును కేటాయించొచ్చని ప్రచారం ఊపందుకుంది. మరి దీనిపై వైసీపీ గానీ,
గ్రీష్మ గానీ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.