కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలు..అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

1.ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
పదోన్నతి పొందిన ఉద్యోగులకూ కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు

2.నేడు వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల
బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమచేయనున్న సిఎం జగన్

3.కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు విచారణకు హాజరైన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
ఇన్‌స్పెక్టర్ పదోన్నతి విషయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోని డీజీపీ

4.వచ్చే నెల 14వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
వారం రోజులు సభ నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడి.

5.సీఎం జగన్ ను కలిసిన త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వరుణ్ గుప్తా..
తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో 1000 కోట్ల పెట్టుబడితో సోలార్ గ్లాస్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరణ.

6.వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్‌కు బెయిల్ నిరాకరించిన హైకోర్టు..
ఈ కేసు విచారణ దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని కోర్టు వెల్లడి.

7.చంద్రబాబు హయాంలో పరిశ్రమలు వచ్చాయి.. జగన్ పరిశ్రమలను తరిమేస్తున్నాడు..
జగన్ పాలనలో అన్నీ అరిష్టాలేనని లోకేష్ విమర్శ.

8.గన్నవరం కేసులో టీడీపీ నేత పట్టాభి బెయిల్ పిటిషన్ పై విచారణ
కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు.

9.రాష్ట్రంలో రైతులను అడుగడుగునా దగా చేసిన సిఎం జగన్ వాటికి సమాధానం చెప్పిన తర్వాతే తెనాలి రావాలి..
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ డిమాండ్‌.

10.కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు..
టెక్కలిలో నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు.