ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ కొత్త ఆలోచనలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిసిస్తు౦దనే చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. టీడీపీ అధికారంలోకి రావాలంటే పవన్ కల్యాణ్ కీలకమని అంటూనే.. 20 సీట్లు ఇస్తే సరిపోదు, ఏదో ఒక పదవి కట్టబెడితే కుదరదు.. అధికార పగ్గాలు తమ కాపులకే ఇవ్వాలని తాజాగా హరిరామ జోగయ్య బహిరంగంగానే ఓ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రెండు నెలలకొకసారి రెండుసార్లు మాత్రమే వస్తారని.. ఆయన చెప్పిన మాటలు విమానం ఎక్కిన తెల్లారే గాలిలో కలిసిపోతున్నాయని పేర్ని నాని సెటైర్లు వేశారు. యాక్షన్ చేస్తున్నారు యాబై కోట్లు తీసుకుంటున్నారని పేర్ని నాని విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో ఓట్లు వేయిస్తే.. మా అమ్మని తిట్టిస్తారా అంటూనే వాడి సంక నాకుతున్నావని, ఇదేనా ఓ కాపు నాయకుడికి ఉండాల్సిన పౌరుషం అంటూ పేర్నినాని ఫైర్ అయ్యారు
ఇక ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు..? ఆ సభలో మళ్ళీ జగన్ సర్కారును ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుంటారా..? లేక వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందో లేదో అన్నది క్లారిటీ ఇస్తారా..? వచ్చే ఎన్నికలకు తమ ఎజెండా వివరిస్తారా ..? తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తారో అన్న హామీలు ప్రకటిస్తారా..? అసలు వారాహి యాత్రకు డేట్ ఫిక్స్ చేస్తారా..? ఇలా అనేక రకాల ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు సభలు, సమావేశాలు పెట్టినా.. జగన్ సర్కారుని విమర్శిస్తూ.. తాను ఊగిపోయి.. తమ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం తప్పా.. రాష్ట్రానికి పనికొచ్చే నాలుగు ముక్కలు ఎప్పుడైనా చెప్పారా అంటూ పుబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. సో.. ఇన్ని రకాల ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఈ సభ వేళ ఎలాంటి ప్రకటనలు చేస్తారో చూడాలి.