హ్యాట్స్ ఆఫ్ సీఎం జగన్ సార్..జీవీఎల్ సైతం ఫిదా

గతంలో చంద్రబాబు ఏదైనా పని చేస్తే దానికి పదింతలు గొప్పలు చెప్పుకునేవారు. గతంలో వరకు ఎందుకండీ.. నిన్న కాక మొన్న ఆయన నిర్వహించిన జిల్లాల రోడ్ షోలో ఇరుకు సందుల్లో సభలు నిర్వహించి.. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నది ఆ పుబ్లిసిటీ పిచ్చితోనేనని పుబ్లిక్ ఇప్పటికీ అంటున్నారు. సింగపూర్ లాంటి రాజధానిని ఏపీలో నెలకొల్పుతానని చెప్పి అమరావతిలో తూతూ మంత్రంగా కట్టడాలు కట్టి..స్క్రీన్ లలో మాత్రం కళ్ళు చేదిరేలా గ్రాఫిక్స్ చూపించి పుబ్లిసిటీ చేసుకున్న మాట వాస్తవం కాదంటారా..? అసలు కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ని ఈ బాబుగారు కడతానని గొప్పలు చెప్పి.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆపేశారు.

ఆయన హయాంలో పుబ్లిసిటీ కోసం కొన్ని వేల బస్సులు ఏర్పాటు చేసి.. ప్రజల్ని తరలించిన మాట వాస్తవ0 కాదంటారా..? అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా.. ఆయన పాలించిన గత అయిదేళ్ళ పాలనలో.. ప్రజా ధనాన్ని తమ పబ్లిసిటీ కోసమే వాడుకున్నారని రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ అంటున్నారు. అయితే.. సీఎం జగన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా పుబ్లిక్ తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. జగన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా తమ పని ద్వారానే ప్రచారం చేయిస్తున్నారు. ఆయన విజన్ ఉన్న నాయకుడని, సత్తా ఉన్నవారని అంటున్నారు. ఇందుకు నిదర్శనం తాజాగా జరిగిన విశాఖలో పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్ అవడమే. అదీ కూడా.. ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే. జగన్ తలచుకుంటే దీని మీద ప్రచారం కొండంత ప్రచారం చేసుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఫలితంగా రిజల్ట్ కనిపించేలా చేశారు. ఇదే ఆయన మార్క్ వర్కింగ్ స్టైల్ అంటున్నారని. హ్యాట్స్ ఆఫ్ సీఎం జగన్ సార్ అంటున్నారు.

ఆయనను ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా పొగిడేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం సిఎం జగన్ మంచి ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తాజాగా ప్రశంసలు కురిపించారు. విశాఖ వెళ్ళిన జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా పెట్టుబడులను ఆకట్టుకోవడానికి కృషి చేశారన్నారు. ఈ సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాలు వాస్తవరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ కు = ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఏపీ అభివృద్దికై కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని కూడా పేర్కొన్నారు.